Share News

Egg Supply: కొత్త జిల్లాల వారీగా కోడి గుడ్ల టెండర్లు!

ABN , Publish Date - Jul 07 , 2025 | 02:19 AM

రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలు, గురుకుల విద్యాసంస్థలు, వసతి గృహాలకు కోడిగుడ్ల సరఫరాకు జిల్లా స్థాయిలోనే వికేంద్రీకృత టెండర్‌ విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

Egg Supply: కొత్త జిల్లాల వారీగా కోడి గుడ్ల టెండర్లు!

  • అంగన్‌వాడీ, గురుకులాలు, హాస్టళ్లకు ఒకటే..

  • ఐదారు రోజుల్లో సర్కారు నోటిఫికేషన్‌!

హైదరాబాద్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలు, గురుకుల విద్యాసంస్థలు, వసతి గృహాలకు కోడిగుడ్ల సరఫరాకు జిల్లా స్థాయిలోనే వికేంద్రీకృత టెండర్‌ విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కొత్త జిల్లాల వారీగా టెండర్లు ఆహ్వానించనుంది. అంగన్‌వాడీ గుడ్ల సరఫరాకు జోనల్‌ టెండర్‌ను రద్దు చేసి న సర్కారు.. ఇప్పటికే కలెక్టర్‌ చైర్మన్‌గా 15 మంది సభ్యులతో కొనుగోలు కమిటీని ఏర్పాటు చేయాలని ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జిల్లా స్థాయి టెండర్‌ నోటిఫికేషన్‌ను ఐదారు రోజుల్లోనే ఇవ్వనున్నట్లు సమాచారం. గతంలో అంగన్‌వాడీ కేంద్రాలకు జోనల్‌ టెండర్‌ విధానం అమలవగా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల పాఠశాల లు, ఇతర సంక్షేమ వసతి గృహాలకు వారి పరిధిలోనే టెండర్లు నిర్వహించుకునేవారు. ఆ విధానాన్ని రద్దు చేసిన సర్కారు.. జిల్లా స్థాయి టెండర్ల ద్వారా స్థానిక కాంట్రాక్టర్లకు అవకాశాలు కల్పించడంతోపాటు సరఫరా ప్రక్రియను వేగిరం చేయడం, నాణ్యతను పర్యవేక్షించడం సులభతరం అవుతుందన్న ఉద్దేశంతో వికేంద్రీకృత టెండర్లు నిర్వహించాలని నిర్ణయించింది.


గతంలో మాదిరిగా అంగన్‌వాడీలకు, గురుకులాలకు వేర్వేరు కాంట్రాక్టర్లు కాకుండా జిల్లా స్థాయిలో టెండర్‌ దక్కించుకున్న వారే అందరికీ గుడ్లు సరఫరా చేయాల్సి ఉంటుంది. గతంలో అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా అయ్యే గుడ్లకు మాత్రమే అగ్‌మార్క్‌ ఉండాలని, టెండర్‌ నోటిఫికేషన్‌ కంటే ముందే రిప్లికా సీరియల్‌ నంబర్‌ ఉండడం తప్పనిసరి అనే నిబంధన ఉంది. దాన్ని జిల్లా స్థాయి టెండర్లకూ వర్తింపజేసే అవకాశం ఉంది. దీనివల్ల నాణ్యమైన గుడ్ల సరఫరాకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో అగ్‌మార్క్‌, రిప్లికా సీరియల్‌ నంబర్‌ గలిగిన వారు 37 మంది వరకు ఉన్నట్లు సమాచారం. అలాగే గతంలో గుడ్లు సరఫరా చేసిన అనుభవం ఉండాలనే నిబంధన కూడా పెట్టే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అలాంటి అనుభవం కేవలం 16 మందికే ఉంది. రోజుకు 10 వేలకు పైగా గుడ్లు ఉత్పత్తి చేసే పౌలీ్ట్ర రైతులు రాష్ట్రంలో 1200 మందికి పైగా ఉన్నారు. 10వేల లోపు ఉత్పత్తి చేసే రైతులు 7 వేల మంది ఉన్నారు. వీరిలో కేలవం 16 మందికే గతంలో ప్రభుత్వ సంస్థలకు గుడ్లు సరఫరా చేసిన అనుభవం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఏడాదికి అన్ని విద్యాసంస్థలకు కలిపి దాదాపు 80 కోట్ల గుడ్లు అవసరం అవుతాయని అంచనా. ఇందుకోసం ప్రభుత్వానికి సుమారు రూ.450 కోట్ల వ్యయం కానుంది.


Also Read:

కేటీఆర్‌కు సామ రామ్మోహన్ రెడ్డి సవాల్..

మోదీ ప్రభుత్వం విద్వేషాలని రెచ్చగొడుతోంది.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్

వందేభారత్‌కు తృటిలో తప్పిన ప్రమాదం..

For More Telangana News And Telugu News

Updated Date - Jul 07 , 2025 | 02:19 AM