Share News

Kaleshwaram: తుమ్మిడిహెట్టి నిర్మాణం 3 బ్యారేజీలు పునర్నిర్మాణం

ABN , Publish Date - Apr 26 , 2025 | 05:12 AM

కాళేశ్వరం బ్యారేజీలపై జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) నివేదిక ఆధారంగా చర్యలకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. నివేదిక అమలు కోసం కమిటీని వేసే అవకాశాలను కూడా పరిశీలిస్తోంది.

Kaleshwaram: తుమ్మిడిహెట్టి నిర్మాణం 3 బ్యారేజీలు పునర్నిర్మాణం

కాళేశ్వరాన్ని నిలబెట్టేందుకు సమాంతర చర్యలు.. ఎన్‌డీఎ్‌సఏ నివేదిక అమలుకు ప్రభుత్వం కసరత్తు

  • మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పునరుద్ధరణకు సై

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం బ్యారేజీలపై జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) నివేదిక ఆధారంగా చర్యలకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. నివేదిక అమలు కోసం కమిటీని వేసే అవకాశాలను కూడా పరిశీలిస్తోంది. ఏక కాలంలో కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ/మరమ్మతులతో పాటే కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానంగా తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం దిశగా ముందుకెళ్లనుంది. ఈ నెల 28న సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఎన్‌డీఎ్‌సఏ నివేదికపై సమావేశం ఉంటుందని అధికారులకు సమాచారం వచ్చింది. నీటి పారుదల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇందులో పాల్గొంటారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై సీఎం అధికారులకు దిశానిర్దేశం చేసే అవకాశాలున్నాయి. ఎన్‌డీఎ్‌సఏ నివేదిక ప్రకారం మేడిగడ్డలోని ఏడో బ్లాకును తొలగించాలి. మూడు బ్యారేజీల్లో సమస్యలను గుర్తించి, మరమ్మతులకు ఉపక్రమిస్తారు. శుక్రవారం రాత్రి ఎన్‌డీఎ్‌సఏ నివేదిక రాగా నీటి పారుదల శాఖ యంత్రాంగం శనివారమంతా దాన్ని అధ్యయనం చేసింది. కొన్ని లోపాలను ఎన్‌డీఎ్‌సఏ సూటిగా ప్రస్తావించలేదన్న అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమయింది.


2023 అక్టోబరు 21న మేడిగడ్డ బ్యారేజీ కుంగితే మరమ్మతులకు వీలుగా లోపాలపై అధ్యయనం చేయాలని తెలంగాణ నీటి పారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్‌ బొజ్జా 2024 ఫిబ్రవరి 13న ఎన్‌డీఎ్‌సఏ ఛైర్మన్‌కు లేఖ రాశారు. 2024 మార్చి 2న కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) ఛైర్మన్‌ జె.చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలో ఆరుగురితో కమిటీ వేశారు. నివేదిక సత్వరం ఇస్తే బ్యారేజీలపై శాశ్వత చర్యల దిశగా ముందుకెళతామని ప్రభుత్వం పలుమార్లు అభ్యర్థించింది. పలు దఫాలుగా కేంద్రానికి లేఖలు రాసింది. ఇప్పుడు నివేదిక చేతికి రావడంతో చర్యలకు మార్గం ఏర్పడింది. మేడిగడ్డకు మరమ్మతులు/పునరుద్ధరణ పనులకు కనీసం ఏడాది సమయం పడుతుందని భావిస్తున్నారు. ఏటా జూలై నుంచి నవంబరు దాకా గోదావరికి భారీగా వరదలు వస్తుంటాయి. నదీగ ర్భంలో ఏ పని చేయడానికి వీలుండదు. ఎన్‌డీఎ్‌సఏ నివేదిక ప్రకారం ఏడో బ్లాకులోని పిల్లర్లు అన్నీ తొలగించాల్సి ఉంది. 6, 8 బ్లాకులు కూడా ప్రభావితం అయ్యాయని తనిఖీల్లో తేలింది. దాంతో ఏ నిర్ణయమైనా తీసుకోవాలన్నా రెండు నెలలు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో మేడిగడ్డకు ఎగువన కన్నెపల్లి పంప్‌హౌస్‌ వద్ద రబ్బర్‌ డ్యామ్‌ ఒకటే పరిష్కారం కానుంది. వరదల సమయంలో నీళ్లన్నీ వదిలేసి.. వరద ఉధృతి తగ్గగానే రబ్బర్‌ డ్యామ్‌ ద్వారా నీటిని నిలుపుదల చేసుకొని పంపింగ్‌ చేయడానికి ఆస్కారం ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

సీటీ స్కాన్‌లో బయటపడ్డ షాకింగ్ విషయం..

వృద్ధిరేటులో ఏపీ రాష్ట్రానికి రెండో స్థానం

పేదవారి కళ్లలో.. ఆనందం చూశా

For More AP News and Telugu News

Updated Date - Apr 26 , 2025 | 05:12 AM