Ponnam Prabhakar: దేశానికే దిక్సూచిగా ప్రజాపాలన
ABN , Publish Date - Apr 08 , 2025 | 04:22 AM
రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరుల్ని చేయడమే లక్ష్యంగా పలు పథకాలు అమలు చేస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.

పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ
డెహ్రాడూన్‌లో మంత్రి పొన్నం
హైదరాబాద్, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరుల్ని చేయడమే లక్ష్యంగా పలు పథకాలు అమలు చేస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. రైతులకు రూ.2 లక్షల దాకా రుణమాఫీ, సన్న వడ్లకు రూ.500 బోనస్, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, సన్న బియ్యం పంపిణీ, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, రూ.500కే గ్యాస్ వంటి పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు గమ్యస్థానంగా నిలిచిందన్నారు. సామాజిక న్యాయం, సాధికారతపై కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ అధ్యక్షతన డెహ్రాడూన్‌లో నిర్వహించిన చింతన్ శిబిర్‌కు మంత్రులు పొన్నం, ధనసరి సీతక్క హాజరయ్యారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో పొన్నం మాట్లాడారు. ప్రజాపాలనలో భాగంగా ఏడాదిలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తీసుకుంటున్న చర్యలు, అమలు చేస్తున్న పథకాలు, సంస్కరణలు దేశానికి దిక్సూచిగా నిలిచాయని చెప్పారు. సామాజిక రుగ్మతలను తొలగించడానికి కులగణన ఒక్కటే పరిష్కారమని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ప్రకటించారని, దానికి అనుగుణంగానే కులగణన నిర్వహించామని తెలిపారు. తెలంగాణలో బీసీలు 56 శాతం ఉన్నారని, వారికి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీ మేరకు కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. బీసీలకు రిజర్వేషన్లను 42శాతానికి పెంచడానికి వీలుగా అసెంబ్లీలో బిల్లును ఆమోదించి, కేంద్రానికి పంపించామన్నారుు. సామాజిక సమానత్వం సాధించాలంటే బీసీ రిజర్వేషన్ల పెంపునకు మద్దతివ్వాలని కోరారు.
అభాగ్యుల అభ్యున్నతికి కృషి: మంత్రి సీతక్క
అభాగ్యుల అభ్యున్నతికి కృషి చేస్తూ దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు., వృద్ధులు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్ల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం చేస్తోందని తెలిపారు. తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పించే దిశగా కృషి చేస్తున్నామని చెప్పారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతం వరకు పెంచడంతో పాటు, ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించినట్లు చెప్పారు. తెలంగాణలో 32.69 లక్షల మంది వృద్ధులకు నెలవారీ పెన్షన్ల కోసం క్రితం ఏడాది రూ. 3,056.94 కోట్లను వెచ్చించినట్లు చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అభయాంజనేయస్వామిని దర్శించుకున్న మంత్రి లోకేష్
దొంగల్లా సభకు వచ్చి సంతకాలు పెట్టి వెళుతున్నారు..
మరో ఆరుగురికి నోటీసులు.. విచారణ...
For More AP News and Telugu News