Assistant Professors: అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి గడువు పెంపు
ABN , Publish Date - Jul 11 , 2025 | 04:34 AM
వైద్యఆరోగ్య శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు మెడికల్ బోర్డు సెక్రటరీ గోపికాంత్ ఓ ప్రకటన విడుదల చేశారు.

వైద్యఆరోగ్య శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు మెడికల్ బోర్డు సెక్రటరీ గోపికాంత్ ఓ ప్రకటన విడుదల చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులకు అర్హులైన వారు ఈ నెల 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. 28, 29 తేదీల్లో తప్పుల సవరణకు అవకాశముంటుందని ప్రకటించారు. గత నెల 28న డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో నియామకం కోసం 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటన ఇచ్చారు. ఆ నోటిఫికేషన్‌లో జూలై 10 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ మొదలయి, 17వ తేదీతో ముగుస్తున్నట్లుగా ఉందని వెల్లడించారు. కానీ సాంకేతికపరమైన సమస్యలు ఉన్నందున అభ్యర్థుల అభ్యర్థన మేరకు బోర్డు మరో పది రోజులు గడువు పొడిగించింది.