Ranga Reddy: తీవ్ర ఉద్రిక్తత.. మహిళా కానిస్టేబుల్‌పై విద్యార్థినుల దాడి
ABN , Publish Date - Nov 02 , 2025 | 01:46 PM
షాద్‌నగర్‌లో హైటెన్షన్ నెలకొంది. ప్రిన్సిపాల్ వేధింపులతో విద్యార్థినులు రోడ్డెక్కారు. ప్రిన్సిపాల్ డౌన్ డౌన్ అంటూ జాతీయ రహదారిపై సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల విద్యార్థులు ధర్నా చేపట్టారు.
రంగారెడ్డి, నవంబర్ 2: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో హైటెన్షన్ నెలకొంది. ప్రిన్సిపాల్ వేధింపులతో విద్యార్థినులు రోడ్డెక్కారు. ప్రిన్సిపాల్ డౌన్ డౌన్ అంటూ జాతీయ రహదారిపై సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల విద్యార్థులు ధర్నా చేపట్టారు. ప్రిన్సిపాల్ శైలజ తమను వేదిస్తున్నారని, ఆమెను సస్పెండ్ చేయాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. ముందు అక్రమాలు ఆపాలని.. ఆ తర్వాత విద్యను అందించండంటూ ప్లకార్డుల ప్రదర్శన చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని విద్యార్థినుల ధర్నాను అడ్దకున్నారు. దీంతో విద్యార్థినులు, పోలీసులకు మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలోనే మఫ్టీలో ఉన్న మహిళా కానిస్టేబుల్ పై విద్యార్థినులు దాడి చేశారు. న్యాయం చేయాలని రోడ్డుపైకి వచ్చిన తమనే కొడతారా? అని విద్యార్థినులు పోలీసులను ప్రశ్నించారు. తీవ్ర ఘర్షణలతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది. జిల్లా కలెక్టర్ వచ్చి తమ సమస్యను పరిష్కరించే వరకూ ఆందోళన విరమించేది లేదని విద్యార్థినులు తేల్చిచెప్పారు. పరిస్థితులను అదుపు చేసేందుకు కొంతమంది విద్యార్థినులను పోలీసుల బలవంతంగా వాహనంలో ఎక్కించుకుని అక్కడి నుంచి తీసుకెళ్లారు.
ఇవి కూడా చదవండి:
Yadagirigutta: సెలవు వేళ.. యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ
Manuguru News: మణుగూరులో ఉద్రిక్తత.. బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణుల దాడి