Share News

నేటి నుంచి టెట్‌ పరీక్షలు

ABN , Publish Date - Jun 18 , 2025 | 05:01 AM

పాఠశాల విద్యాశాఖ నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)లు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.

నేటి నుంచి టెట్‌ పరీక్షలు

హైదరాబాద్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): పాఠశాల విద్యాశాఖ నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)లు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 15 జిల్లాల్లో 66 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని, అన్ని ఏర్పాట్లు పూర్తచేశామని టీజీటెట్‌ చైౖర్‌పర్సన్‌, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్‌ నికోలస్‌ తెలిపారు.


పరీక్షకు మొత్తం 1,83,653 మంది దరఖాస్తు చేసుకోగా వీరిలో పేపర్‌-1 కోసం 63,261, పేపర్‌-2 కోసం 1,20,392 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉపాధ్యాయ అర్హత పరీక్షను ప్రతి ఏటా రెండుసార్లు నిర్వహిస్తుండగా.. ఈ ఏడాదికి సంబంధించి ఇది మొదటి పరీక్ష కానుంది.

Updated Date - Jun 18 , 2025 | 05:01 AM