Bhatti Vikramarka: హరిత ఇంధనంలో రూ.29 వేల కోట్లు
ABN , Publish Date - Apr 17 , 2025 | 04:14 AM
రాష్ట్రంలో 2035 కల్లా 40 వేల మెగావాట్ల హరిత ఇంధనాన్ని (గ్రీన్ పవర్) ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు.

పెట్టుబడులకు ముందుకొచ్చిన ఎకోరెన్, జీపీఎస్ ఆర్య
రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు ఖరారు
2035 కల్లా 40 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యం
డిమాండ్‌కు తగ్గట్లుగా విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
హైదరాబాద్, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 2035 కల్లా 40 వేల మెగావాట్ల హరిత ఇంధనాన్ని (గ్రీన్ పవర్) ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 17,162 మెగావాట్ల గరిష్ఠ విద్యుత్ డిమాండ్ ఉందని, పకడ్బందీ వ్యూహంతో అంతరాయం లేకుండా విద్యుత్‌ను అందిస్తున్నామని చెప్పారు. బుధవారం రాజేంద్రనగర్‌లోని తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థలో జరిగిన కార్యక్రమంలో హరిత ఇంధన రంగంలో రూ.29 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన ఎకోరెన్, జీపీఎస్ రెన్యూవబుల్స్ ఆర్య సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఎకోరెన్ ఎనర్జీ సంస్థ రూ.27వేల కోట్లతో రాష్ట్రంలో 11 చోట్ల 5579 మెగావాట్ల హరిత ఇంధన ప్లాంట్లు పెట్టడానికి వీలుగా ఒప్పందం చేసుకుంది.
జీపీఎస్ రెన్యూవబుల్స్ ఆర్య సంస్థ రూ.2 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. భట్టి విక్రమార్క సమక్షంలో ఆయా సంస్థలు రాష్ట్ర విద్యుత్ సంస్థలతో ఎంవోయూ చేసుకున్నాయి. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ హైదరాబాద్ చుట్టూ జరుగుతున్న అభివృద్ధి, కొత్తగా వస్తున్న పరిశ్రమలు, మూసీ పునరుజ్జీవం, ఫ్యూచర్ సిటీ ఏర్పాటుతో విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని కేంద్ర సంస్థలు నివేదికలు ఇచ్చాయని, దానికి తగ్గట్లుగా విద్యుత్ ప్రాజెక్టులు చేపట్టాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కాలుష్యం లేని హరిత ఇంధన ఉత్పత్తికి ప్రాధాన్యం ఇస్తూ ముందుకెళుతున్నామని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
IAS Smita Sabharwal: ఐఏఎస్ స్మితా సబర్వాల్‍కు నోటీసులు.. విషయం ఏంటంటే..
Poisoning In School: విద్యార్థులపై విష ప్రయోగం.. సంచలనం రేపుతున్న ఘటన..
Chandanotsavam 2025: సింహాచలానికి సీఎం చంద్రబాబు వచ్చేది ఆ రోజే: మంత్రి ఆనం..