విద్యుత్ డిమాండ్ రికార్డులు బద్దలు
ABN , Publish Date - Feb 27 , 2025 | 04:10 AM
రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పరుగులు పెడుతోంది. ఇప్పటికే నమోదైన అత్యధిక డిమాండ్‌ను తోసిరాజని... మంగళవారం ఉదయం 8.03 గంటల సమయంలో 16,506 మెగావాట్లుగా నమోదయింది.

16,506 మెగావాట్లుగా నమోదు
తెలంగాణ ఏర్పడ్డాక ఇదే అత్యధికం
హైదరాబాద్, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పరుగులు పెడుతోంది. ఇప్పటికే నమోదైన అత్యధిక డిమాండ్‌ను తోసిరాజని... మంగళవారం ఉదయం 8.03 గంటల సమయంలో 16,506 మెగావాట్లుగా నమోదయింది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఇదే అత్యధిక డిమాండ్. అంతకు ముందు 21న మధ్యాహ్నం 12.02 గంటల సమయంలో 16,412 మెగావాట్లుగా నమోదు కాగా... మంగళవారం దాన్ని దాటేసి... 16,506 మెగావాట్లుగా నమోదయింది. డిమాండ్(ఏకకాలంలో ఆయా పరికరాల వినియోగంతో రికార్డయ్యేది)తో పాటు వినియోగం(రోజంతా విద్యుత్ వాడకం) కూడా భారీగా పెరిగింది. ఈ నెల 25న రాష్ట్ర విద్యుత్ వినియోగం 313.373 మిలియన్ యూనిట్లు(ఒక మిలియన్ 10 లక్షల యూనిట్లు)గా నమోదయింది. 21న 313.36 మిలియన్ యూనిట్లుగా ఉండటం గమనార్హం.