Share News

Power Discoms: డిస్కమ్‌ల నష్టాలు తడిసిమోపెడు!

ABN , Publish Date - Feb 17 , 2025 | 04:23 AM

రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కమ్‌)ల నష్టాలు తడిసిమోపెడవుతున్నాయి. 2023-24 సంవత్సరంనాటికి రాష్ట్రంలోని రెండు డిస్కమ్‌ల నష్టాలు రూ.67,276 కోట్లకు చేరడమే ఇందుకు తార్కాణం.

Power Discoms: డిస్కమ్‌ల నష్టాలు తడిసిమోపెడు!

  • 2023-24నాటికి రూ.67,276 కోట్లకు చేరిక

  • విద్యుత్‌ కొనేందుకు అధికంగా ఖర్చు చేయడమే కారణం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కమ్‌)ల నష్టాలు తడిసిమోపెడవుతున్నాయి. 2023-24 సంవత్సరంనాటికి రాష్ట్రంలోని రెండు డిస్కమ్‌ల నష్టాలు రూ.67,276 కోట్లకు చేరడమే ఇందుకు తార్కాణం. రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ)కి 2025-26 సంవత్సరానికి సంబంధించి ఇటీవల తాము సమర్పించినడిస్ట్రిబ్యూషన్‌ బిజినెస్‌, వీలింగ్‌ టారిఫ్‌ ప్రతిపాదనలపై వచ్చిన అభ్యంతరాలకు వివరణ ఇస్తూ ఈ వి వరాలను డిస్కమ్‌లు వెల్లడించాయి. ఇందులో దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపి ణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్‌) నష్టాలు రూ.47,239.15 కోట్లున్నాయి. ఈ సంస్థ 2023-24లో రూ.4,909.53 కోట్ల నికర నష్టాలను మూటగట్టుకుంది.


ఇక ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీజీఎన్పీడీసీఎల్‌) నష్టాలు 2023-24నాటికి రూ.20,036.92 కోట్లకు పెరిగాయి. 2023-24లో ఈ సంస్థ రూ.1,441.18 కోట్ల నికర నష్టాలను నమోదు చేసుకుంది. 2023-24లో రెండు డిస్కమ్‌ల నష్టాలు కలిపితే రూ.6,350.71 కోట్లుగా ఉన్నాయి. వినియోదారులకు నిరంతరం విద్యుత్‌ సరఫరా చేసేందుకు విద్యుత్‌ కొనుగోళ్లకు అధిక వ్యయం చేయడం మూలంగానే ఈ మేరకు నష్టాలను చవిచూడాల్సి వచ్చినట్టు రెండు డిస్కమ్‌లు స్పష్టంచేశాయి. వివిధ గ్రాంట్లు, పథకాల కింద ప్రభుత్వం అదనపు సహాయాన్ని అందిస్తే నష్టాల నుంచి బయటపడతామని టీజీఎన్పీడీసీఎల్‌ పేర్కొంది.

Updated Date - Feb 17 , 2025 | 04:23 AM