Share News

CM Revanth Reddy: తెలంగాణ పోలీస్‌.. భేష్‌ !

ABN , Publish Date - Apr 25 , 2025 | 04:02 AM

పోలీసింగ్‌లో తెలంగాణ పోలీసులు దేశంలోనే ప్రఽథమ స్ధానం సంపాదించుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. డీజీపీ జితేందర్‌, ఇంటెలిజెన్స్‌ డీజీ శివధర్‌రెడ్డిలకు అభినందనలు తెలిపారు.

CM Revanth Reddy: తెలంగాణ పోలీస్‌.. భేష్‌ !

  • డీజీపీ, ఇంటెలిజెన్స్‌ డీజీలకు సీఎం అభినందనలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): పోలీసింగ్‌లో తెలంగాణ పోలీసులు దేశంలోనే ప్రఽథమ స్ధానం సంపాదించుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. డీజీపీ జితేందర్‌, ఇంటెలిజెన్స్‌ డీజీ శివధర్‌రెడ్డిలకు అభినందనలు తెలిపారు. గురువారం పోలీసు ఉన్నతాధికారులు సీఎం రేవంత్‌ను కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో కలిసి ఇండియా జస్టిస్‌ నివేదిక పూర్తి వివరాలను అందచేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఇది తెలంగాణ పోలీసుల సమష్టి విజయమని, మరింత నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి, సీఎస్‌ శాంతికుమారి పాల్గొన్నారు. కాగా, రాష్ట్రంలోని ప్రతి పోలీసు యూనిట్‌లో పది మంది మహిళలకన్నా ఎక్కువున్న చోట సహస్‌ కమిటీలు ఏర్పాటు చేయాలని డీజీపీ జితేందర్‌ సూచించారు. తెలంగాణ మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో ఈ కమిటీలు పనిచేయాలన్నారు. డీజీపీ కార్యాలయంలో సహస్‌ కమిటీల రెండు రోజుల సదస్సును గురువారం డీజీపీ ప్రారంభించి మాట్లాడారు. మహిళా సిబ్బంది నుంచి వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు స్వీకరించి న్యాయబద్ధంగా, వేగంగా పరిష్కరించాలని సూచించారు.


  • పోలీసు కుటుంబాల నుంచి సివిల్స్‌కు ముగ్గురి ఎంపిక

పోలీసు సిబ్బంది కుటుంబాల నుంచి సివిల్స్‌కు ఎంపికైన ముగ్గురిని డీజీపీ జితేందర్‌ అభినందించారు. డీజీపీ కార్యాలయంలో గురువారం వారిని సత్కరించారు. డిచ్‌పల్లి హెడ్‌ కానిస్టేబుల్‌ గోవింద్‌ కుమారుడు సాయి చైతన్య సివిల్స్‌లో 68వ ర్యాంకు, డీజీపీ కార్యాలయంలో డీఎస్పీగా పనిచేస్తున్న వేణుగోపాల్‌ కుమారుడు కౌశిక్‌ నర్సింహ 225వ ర్యాంకు, అసెంబ్లీలో చీఫ్‌ మార్షల్‌గా పనిచేస్తున్న కరుణాకర్‌ కుమారుడు టి.సూర్యతేజ 779వ ర్యాంకు సాధించారు.


ఇవి కూడా చదవండి

Honeymoon Couple: హనీమూన్‌కు వెళ్లిన జంట.. కాల్పులకు ముందు ఏం చేశారంటే..

Nellore Police High Alert: నెల్లూరుపై ఉగ్రనీడలు.. పోలీసుల అలర్ట్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 25 , 2025 | 04:02 AM