Share News

Minister Seethakka : ఎస్టీల నిధులను వారికే ఖర్చు చేయాలి

ABN , Publish Date - Jul 29 , 2025 | 04:04 AM

ఎస్టీలకు కేటాయించిన నిధులను అదే అసెంబ్లీ నియోజకవర్గంలో, అదే జిల్లాలో వారికే సర్దుబాటు చేయాలే తప్ప.. మైదాన ప్రాంతాలకు తరలించవద్దని మంత్రి సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌ సూచించారు.

Minister Seethakka : ఎస్టీల నిధులను వారికే ఖర్చు చేయాలి

  • గత ప్రభుత్వ హయాంలో ఆ నిధులు పక్కదారి

  • మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌

హైదరాబాద్‌, జూలై 28 (ఆంధ్రజ్యోతి): ఎస్టీలకు కేటాయించిన నిధులను అదే అసెంబ్లీ నియోజకవర్గంలో, అదే జిల్లాలో వారికే సర్దుబాటు చేయాలే తప్ప.. మైదాన ప్రాంతాలకు తరలించవద్దని మంత్రి సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌ సూచించారు. గత ప్రభుత్వ హయాంలో ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులు పక్కదారి పట్టాయని అన్నారు. దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్‌లో సోమవారం 7వ గిరిజన సంక్షేమ సలహా మండలి సమావేశం జరిగింది. మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌లతో పాటు డిప్యూటీ స్పీకర్‌ రామచంద్రనాయక్‌, ఆదిలాబాద్‌ ఎంపీ గోడెం నగేశ్‌, ఆదివాసీ గిరిజన ఎమ్మెల్యేలు, ట్రైకార్‌ ఛైర్మన్‌ బెల్లయ్య నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.


సీతక్క మాట్లాడుతూ.. గిరిజన సంక్షేమం విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుతున్నామని చెప్పారు. ఇళ్లు లేని ఎస్సీలకు నిధుల కేటాయింపు పెంపు విషయాన్ని పరిశీలిస్తున్నామని, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కనీస స్థల అర్హతను సడలించాలని డిమాండ్‌ ఉన్న నేపథ్యంలో సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్థి కోసం చేేస పనులకు బిల్లులను సకాలంలో చెల్లిస్తామని, ఈ విషయంలో గత ప్రభుత్వ తప్పిదాలను పునరావృతం కానివ్వబోమని మంత్రి అడ్లూరి స్పష్టం చేశారు.

Updated Date - Jul 29 , 2025 | 04:04 AM