Dialysis Patients: డయాలసిస్ రోగులకు ప్రభుత్వం చేయూత
ABN , Publish Date - Jul 22 , 2025 | 04:38 AM
రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 681 మంది డయాలసిస్ రోగులకు పెన్షన్ల మంజూరుకు మంత్రి సీతక్క ఆమోదం తెలిపారు. వీరిలో 629 మంది రోగులు హైదరాబాద్‌లో చికిత్స పొందుతుండగా..

కొత్తగా 681 మందికి పెన్షన్లు మంజూరు
హైదరాబాద్, జూలై 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 681 మంది డయాలసిస్ రోగులకు పెన్షన్ల మంజూరుకు మంత్రి సీతక్క ఆమోదం తెలిపారు. వీరిలో 629 మంది రోగులు హైదరాబాద్‌లో చికిత్స పొందుతుండగా.. మిగిలిన 52 మంది రోగులు ఇతర జిల్లాల్లో చికిత్స పొందుతున్నారు. వచ్చే ఆగస్టు నుంచి పెన్షన్ డబ్బులు వారి ఖాతాల్లో జమకానున్నాయి. తాజా నిర్ణయంతో ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం పొందుతున్న డయాలసిస్ రోగుల సంఖ్య 4,029కి చేరింది. ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ ద్వారా వివిధ ఆసుపత్రుల్లో చికిత్సపొందుతున్న డయాలసిస్ రోగులను ప్రభుత్వం గుర్తిస్తోంది. సెర్ప్ ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేసి పెన్షన్లను మంజూరు చేస్తోంది.
నేడు టెట్ ఫలితాలు
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. ఈ ఏడాదిలో జూన్ 18 నుంచి 30 వరకు టెట్ పరీక్షలు నిర్వహించారు. వీటి ఫలితాలను పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ మంగళవారం ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆర్టీఐలో సామాజిక న్యాయం ఎక్కడ? ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న..
రేవంత్ నాటుకోడి.. కేటీఆర్ బాయిలర్ కోడి
Read latest Telangana News And Telugu News