Heatwave: ఠారెత్తిస్తున్న ఎండలు..
ABN , Publish Date - Apr 23 , 2025 | 04:23 AM
రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. మంగళవారం నిర్మల్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అత్యధికంగా 44.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవగా, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో 44.4, జగిత్యాల జిల్ల్లాలో 44.1, పెద్దపల్లి జిల్లాలో 44.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.

నిర్మల్‌లో అత్యధికంగా 44.5 డిగ్రీలు
రాబోయే రెండురోజులు రాష్ట్రంలో
45 డిగ్రీలు దాటొచ్చన్న వాతావరణశాఖ
8 జిల్లాలకు రెడ్ అలెర్ట్..
మిగతా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ
(ఆంధ్రజ్యోతి నెట్‌వర్క్): రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. మంగళవారం నిర్మల్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అత్యధికంగా 44.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవగా, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో 44.4, జగిత్యాల జిల్ల్లాలో 44.1, పెద్దపల్లి జిల్లాలో 44.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. కరీంనగర్ జిల్లాలో 44 డిగ్రీలు, కుమరం భీం ఆసిఫాబాద్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో 43.8, మంచిర్యాల జిల్లాలో 43.7, కామారెడ్డి జిల్లాలో 43.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించింది. రాబోయే రెండు రోజులపాటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని పేర్కొంది. ములుగు, హనుమకొండ, కరీంనగర్, భూపాలపల్లి, పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో గురువారం 45 నుంచి 47 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని పేర్కొంది.
ఆ ఎనిమిది జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. కాగా, ఖమ్మం జిల్లా మల్లవరం గ్రామానికి చెందిన మేడి ఎర్ర ముత్తయ్య (76) అనే రైతు సోమవారం పొలం వద్దకు వెళ్లారు. వడదెబ్బ తగలడంతో అదేరోజు రాత్రి అస్వస్థతకు గురై అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఆయన్ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వల్లంపట్లకు చెందిన పాత భూమయ్య (55) అనే చిరువ్యాపారి ఇంటింటికీ తిరుగుతూ చింతగింజలను కొనుగోలు చేస్తుంటారు. మంగళవారం వ్యాపారానికి వెళ్లిన ఆయన వడదెబ్బ తగలడంతో కిందపడిపోయి మరణించారు.
ఇవి కూడా చదవండి
Falaknuma Crime News: వివాహమైన మూడు రోజులకే రౌడీషీటర్ దారుణ హత్య.. ఏం జరిగిందంటే
CM Revanth Praised Women: సన్నబియ్యంతో సహపంక్తి భోజనం.. మహిళకు సీఎం అభినందనలు
Read Latest Telangana News And Telugu News