Liquor Price Hike: బిగ్ షాక్.. భారీగా పెరగనున్న మద్యం ధరలు..
ABN , Publish Date - Apr 17 , 2025 | 04:37 PM
Liquor Price Hike: మద్యం ప్రియులకు బిగ్ షాక్ తగల నుంది. మందు తాగాలంటే.. తమ జేబుల నుంచి అధిక మొత్తంలో సమర్పించుకునే పరిస్థితి రానుంది. అవును, త్వరలోనే మద్యం ధరలను భారీగా పెంచనుంది ప్రభుత్వం. పూర్తి వివరాలను ఈ కథనంలో చూడండి..

హైదరాబాద్, ఏప్రిల్ 17: తెలంగాణ ప్రభుత్వం మద్యం ప్రియులకు బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే బీర్ల ధరలు భారీగా పెంచిన సర్కార్.. ఇప్పుడు లిక్కర్ ధరలను కూడా పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే బీర్ల ధరలను 15 శాతం పెంచిన సర్కార్.. ఇప్పుడు మందు బాటిళ్లపైనా ధరలు పెంచాలని భావిస్తున్నట్లు అధికార వర్గాల నుంచి సమాచారం అందుతోంది. చీప్ లిక్కర్ మినహా.. రూ. 500 కంటే ఎక్కువ ధర ఉన్న మద్యం బాటిళ్ల ధరలు పెంచనున్నట్లు విశ్వసనీయ సమాచారం. లిక్కర్ బాటిళ్లపై కనీసం 10 శాతం ధరలు పెంచాలని ప్రభుత్వం భావిస్తోందట. ఇదే జరిగితే బాటిల్‌పై కనీసం రూ. 50 పెరిగే అవకాశం ఉంది. అధికారులతో సమీక్ష జరిపిన అనంతరం ధరల పెంపుపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని, ఆ తరువాత అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read:
నోటి దుర్వాసనకు ఈ నూనెతో చెక్..
ప్రపంచంలో తొలిసారిగా వీర్య కణాల మధ్య పరుగుపందెం!
For More Telangana News and Telugu News..