ముగ్గురు ఐఏఎస్ అధికారులకు అదనపు బాధ్యతలు
ABN , Publish Date - Jun 29 , 2025 | 03:53 AM
రాష్ట్రంలోని ముగ్గురు ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులను జారీ చేశారు.

ఫ్యూచర్ సిటీ డెవల్‌పమెంట్ అథారిటీ ఏఓగా మహేందర్
హైదరాబాద్, జూన్ 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ముగ్గురు ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులను జారీ చేశారు. ఫ్యూచర్ సిటీ డెవల్‌పమెంట్ అథారిటీ కమిషనర్ కె.శశాంకకు తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ వల్లూరు క్రాంతికి గనులు, భూగర్భ వనరుల శాఖ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది.
సెర్ప్ అదనపు సీఈఓ పి.కాత్యాయనీ దేవికి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. గతంలో కేటీఆర్ వద్ద ఓఎ్‌సడీగా పనిచేసిన ఖమ్మం జిల్లా మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్, నాన్ ఐఏఎస్ పి.మహేందర్‌ను, ఫ్యూచర్ సిటీ డెవల్‌పమెంట్ అథారిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా పోస్టింగ్ ఇచ్చింది. తెలంగాణ క్యాడర్‌కు చెందిన 2023 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి గరిమా నరులాను కేంద్ర ప్రభుత్వం రాజస్థాన్ క్యాడర్‌కు బదిలీ చేసింది.