విద్యుత్ డిమాండ్‌కు రెక్కలు
ABN , Publish Date - Feb 07 , 2025 | 03:43 AM
వేసవికి ముందే తెలంగాణలో విద్యుత్ డిమాండ్‌కు రెక్కలు వచ్చాయి. గురువారం రాష్ట్రంలో 15,752 మెగావాట్ల డిమాండ్ నమోదైంది.

15,752 మెగావాట్లుగా నమోదు
11 ఏళ్లలో ఇప్పటి వరకు ఇదే అత్యధికం: ట్రాన్స్‌కో
హైదరాబాద్, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): వేసవికి ముందే తెలంగాణలో విద్యుత్ డిమాండ్‌కు రెక్కలు వచ్చాయి. గురువారం రాష్ట్రంలో 15,752 మెగావాట్ల డిమాండ్ నమోదైంది. 11 ఏళ్లలో ఇదే అత్యధికం. చివరగా 2024 మార్చి 8న 15,623 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ వచ్చింది. ఈ వేసవిలో 17 వేల మెగావాట్ల వరకు డిమాండ్ నెలకొనే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
గృహ, వ్యవసాయ వినియోగం పెరగడంతోనే ఈ డిమాండ్ వస్తోందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు అత్యధిక డిమాండ్ వస్తుండటంతో జెన్‌కో కేంద్రాల్లో విద్యుత్ ఉత్పాదనను తగ్గించి, బహిరంగ విపణిలో కరెంట్ కొనుగోళ్లు చేయడ ం ద్వారా 2023 డిసెంబరు నుంచి 2025 జనవరి దాకా రూ.982.66 కోట్లు ఆదా చేశామని ట్రాన్స్‌కో సీఎండీ డి.కృష్ణ భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు.