Talasani Srinivas Yadav: నవంబర్ 29 చరిత్రలో నిలిచిపోయే రోజు..
ABN , Publish Date - Nov 28 , 2025 | 08:50 AM
తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అంటూ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష దేశ రాజకీయాల్లో పెను భూకంపం సృష్టించిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నవంబర్ 29 చరిత్రలో నిలిచిపోయే రోజు అని ఆయన అన్నారు.
- తలసాని శ్రీనివాస్‌యాదవ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో నవంబర్ 29 చరిత్రలో నిలిచిపోయే రోజని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(BRS MLA Talasani Srinivas Yadav) అన్నారు. తెలంగాణ భవన్‌లో గురువారం జీహెచ్‌ఎంసీ స్థాయి బీఆర్‌ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశం ఆయన అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అంటూ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష దేశ రాజకీయాల్లో పెను భూకంపం సృష్టించిందన్నారు.

మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, హామీల అమలును మరిచి ప్రజలను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి కేవలం 17 శాతమే కేటాయించి మోసం చేసిందన్నారు. తిరిగి అధికారంలోకి వచ్చేది తామేనని, కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన వారికి సముచిత గౌరవం కల్పిస్తామని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజకీయ నినాదాలు కాదు.. వివక్షకు ఆధారాలు చూపాల్సిందే
ముఖ్యమంత్రా.. రియల్ ఎస్టేట్ ఏజెంటా..?
Read Latest Telangana News and National News