Medak: రూ.2 కే షర్టు.. సోషల్ మీడియాలో పోస్టు
ABN , Publish Date - Jul 22 , 2025 | 04:11 AM
ఓ రెడిమేడ్ వస్త్ర దుకాణం ప్రారంభం సందర్భంగా రెండు రూపాయలకే షర్టు ఇస్తామని దుకాణ యజమాని సోషల్ మీడియాలో చేసిన పోస్టు తొక్కిసలాటకు దారితీసింది.

కొనేందుకు ఎగబడ్డ యువకులు, తోపులాట
నర్సాపూర్, జూలై 21 (ఆంధ్రజ్యోతి): ఓ రెడిమేడ్ వస్త్ర దుకాణం ప్రారంభం సందర్భంగా రెండు రూపాయలకే షర్టు ఇస్తామని దుకాణ యజమాని సోషల్ మీడియాలో చేసిన పోస్టు తొక్కిసలాటకు దారితీసింది. ఈ ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో సోమవారం జరిగింది. వస్త్ర దుకాణ యజమాని చేసిన పోస్టు చూసిన యువకులు ఉదయం నుంచే ఆ దుకాణం వద్దకు వచ్చి బారులు తీరారు.
దుకాణం తెరిచిన వెంటనే ఒక్కసారిగా అందరూ లోపలికి చొచ్చుకుని వెళ్లడంతో అక్కడ తొక్కిసలాటతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. నియంత్రించలేక దుకాణం యజమాని దుకాణం మూసేసి అక్కడి నుంచి జారుకున్నాడు. అక్కడ గుమిగూడిన యువకుల అల్లరితో పోలీసులు వచ్చి వారిని అక్కడి నుంచి చెదరగొట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆర్టీఐలో సామాజిక న్యాయం ఎక్కడ? ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న..
రేవంత్ నాటుకోడి.. కేటీఆర్ బాయిలర్ కోడి
Read latest Telangana News And Telugu News