Share News

SSC Exam Results: పదో తరగతి అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ ఫలితాల్లో 73.35 శాతం ఉత్తీర్ణత

ABN , Publish Date - Jun 28 , 2025 | 04:45 AM

పదో తరగతి అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను శుక్రవారం విడుదల చేశారు. ఈ నెల 3 నుంచి 13 వరకు నిర్వహించిన పరీక్షలకు 42,834 మంది దరఖాస్తు చేసుకోగా 38,741మంది హాజరయ్యారు.

SSC Exam Results: పదో తరగతి అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ ఫలితాల్లో 73.35 శాతం ఉత్తీర్ణత

  • రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు జూలై 7 వరకు గడువు

హైదరాబాద్‌, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను శుక్రవారం విడుదల చేశారు. ఈ నెల 3 నుంచి 13 వరకు నిర్వహించిన పరీక్షలకు 42,834 మంది దరఖాస్తు చేసుకోగా 38,741మంది హాజరయ్యారు. వీరిలో 28,415(73.35ు)మంది ఉత్తీర్ణత సాధించారని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఎ.క్రిష్ణారావు తెలిపారు. వీరిలో అబ్బాయిలు 71.05 శాతం, అమ్మాయిలు 77.08 శాతం ఉన్నారు. జనగామ జిల్లా 100శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రస్థాయిలో మొదటిస్థానం సాధించగా.. 55.90శాతంతో సంగారెడ్డి చివరిస్థానంలో నిలిచింది.


హైదరాబాద్‌ జిల్లాలో 61.13శాతం, రంగారెడ్డి జిల్లాలో 82.13 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పరీక్ష కేంద్రాల నుంచి సమాచారం రావాల్సి ఉన్నందున కొందరి ఫలితాలు విత్‌హెల్డ్‌లో పెట్టామని, వాటిని త్వరలో ప్రకటిస్తామని క్రిష్ణారావు తెలిపారు. రీకౌంటింగ్‌కు సబ్జెక్టుకు రూ.500, రీవెరిఫికేషన్‌కు రూ.1,000చొప్పున 7వ తేదీలోపు చెల్లించాల్సి ఉంటుందన్నారు.

Updated Date - Jun 28 , 2025 | 04:45 AM