Warangal: వరంగల్‌కు స్పోర్ట్స్ స్కూల్..!
ABN , Publish Date - Jul 30 , 2025 | 03:33 AM
వరంగల్‌లో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ మెమోరియల్ స్టేడియం (జేఎన్‌ఎం)లో తాత్కాలికంగా స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

తాత్కాలికంగా జేఎన్‌ఎం స్టేడియంలో ఏర్పాటు
వరంగల్ ఎమ్మెల్యేల ప్రతిపాదనలకు సీఎం ఆమోదం
వరంగల్, జూలై 29 (ఆంధ్రజ్యోతి): వరంగల్‌లో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ మెమోరియల్ స్టేడియం (జేఎన్‌ఎం)లో తాత్కాలికంగా స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. క్రీడా, యువజనుల సర్వీసులశాఖ అధికారులు జేఎన్‌ఎంలో ఉన్న వసతులను రెండు రోజులపాటు పరిశీలించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్.నాగరాజు, యశస్వినిరెడ్డి ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వరంగల్‌లో స్పోర్ట్స్ స్కూల్‌తో పాటు అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియాన్ని మంజూరు చేయాలని కోరారు.
క్రీడాశాఖ అధికారులకు సీఎం ఫోన్ చేసి వరంగల్‌లో స్పోర్స్ట్ స్కూల్, స్టేడియం కోసం డీపీఆర్ సిద్ధం చేయాలని ఆదేశించారు. తర్వాత స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీసెస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్‌ను ఎమ్మెల్యేల బృందం కలవగా.. వెంటనే డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారిని వరంగల్‌కు పంపించారు. తాత్కాలికంగా స్పోర్ట్స్ స్కూల్‌కు జేఎన్‌ఎం స్టేడియం అనుకూలంగా ఉందని అధికారులు అంచనా వేశారు. జయేశ్ రంజన్ మౌఖిక ఆదేశాలతో తాత్కాలికంగా స్పోర్ట్స్ స్కూల్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఆగస్టు 15న సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు స్టేడియం కోసం ధర్మసాగర్ మండలం ఉనికిచర్ల వద్ద జాతీయ రహదారి 163కు సమీపంలో 20ఎకరాలు, కూడకు సమీపంలో 30 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఒకటిరెండు రోజుల్లో అధికారికంగా స్పోర్ట్స్ స్కూల్, స్టేడియానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి
సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట
హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్
Read latest Telangana News And Telugu News