IAS Transfer: స్మితా సభర్వాల్‌పై వేటు..
ABN , Publish Date - Apr 28 , 2025 | 04:15 AM
సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితాసభర్వాల్‌పై వేటు పడింది. పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా.. మిస్ వరల్డ్ పోటీలకు సన్నాహాలు చేస్తున్న ఆమెను ప్రభుత్వం పాత స్థానానికి బదిలీ చేసింది. ఆర్థిక సంఘం(ఫైనాన్స్ కమిషన్) సభ్య కార్యదర్శిగా నియమించింది.

అప్రాధాన్య పోస్టుకు బదిలీ.. భారీగా ఐఏఎ్‌సల బదిలీలు
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావు.. ఈ ఏడాది ఆగస్టు వరకు పదవీ కాలం
జయేశ్‌రంజన్‌కు కీలక బాధ్యతలు.. పరిశ్రమల పెట్టుబడుల సెల్‌కు సీఈవో
మిస్ వరల్డ్ పోటీల బాధ్యత కూడా.. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆర్వీ కర్ణన్
హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా ఇలంబర్తి.. కుటుంబ సంక్షేమ కమిషనర్‌గా సంగీత సత్యనారాయణ
హైదరాబాద్, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితాసభర్వాల్‌పై వేటు పడింది. పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా.. మిస్ వరల్డ్ పోటీలకు సన్నాహాలు చేస్తున్న ఆమెను ప్రభుత్వం పాత స్థానానికి బదిలీ చేసింది. ఆర్థిక సంఘం(ఫైనాన్స్ కమిషన్) సభ్య కార్యదర్శిగా నియమించింది. ఆదివారం ప్రభుత్వం భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై ఆమె సర్కారుకు వ్యతిరేకంగా పోస్టు చేయడం ఇటీవల చర్చనీయాంశమైన విషయం తెలిసిందే..! దీనిపై వివరణ ఇవ్వాలంటూ గచ్చిబౌలి పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. అప్పటి నుంచే స్మిత బదిలీ తప్పనిసరి అనే ప్రచారం జరిగింది. తాజా నిర్ణయంతో సర్కారు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ప్రపంచ సుందరి పోటీల బాధ్యత నుంచి ఆమెను తప్పించినట్లయింది. కాగా.. సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్‌రంజన్‌కు తాజా బదిలీల్లో పరిశ్రమల శాఖలో మరింత కీలకమైన బాధ్యతలను అప్పగించారు.
ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేకంగా ‘పరిశ్రమల పెట్టుబడుల సెల్’ను ఏర్పాటు చేసి, జయేశ్ రంజన్‌ను సీఈవోగా నియమించారు. దీంతోపాటు.. స్మిత సభర్వాల్ ఇప్పటి వరకు పర్యవేక్షించిన పర్యాటక శాఖ అదనపు బాధ్యతలను కూడా జయేశ్‌రంజన్‌కు అప్పగించారు. అంటే.. ప్రపంచ సుందరి పోటీలను ఆయనే పర్యవేక్షిస్తారు. పురపాలక పాలన, పట్టణాభివృద్ది ముఖ్యకార్యదర్శిగా ఉన్న దానకిశోర్ కార్మికశాఖకు బదిలీ అవ్వగా.. ఆ స్థానంలో ఉన్న సంజయ్‌కుమార్‌ను పరిశ్రమలు, వాణిజ్యశాఖ ముఖ్యకార్యదర్శిగా నియమించారు. గవర్నర్ కార్యాలయ ముఖ్యకార్యదర్శిగా కూడా దానకిశోర్‌కు అదనపు బాధ్యతలను అప్పగించారు. పాఠశాల విద్య సంచాలకుడిగా ఈవీ నర్సింహరెడ్డిని పరిశ్రమల పెట్టుబడుల సెల్‌కు అదనపు సీఈవోగా బదిలీ చేశారు.
అధికారి పేరు బదిలీ అయిన స్థానం
ఆర్వీ కర్ణన్ జీహెచ్‌ఎంసీ కమిషనర్
సంగీత సత్యనారాయణ వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్
ఇలంబర్తి పట్టణాభివృద్ధి కార్యదర్శి(హెచ్‌ఎండీఏ పరిధి)
టీకే శ్రీదేవి పట్టణాభివృద్ధి కార్యదర్శి(హెచ్‌ఎండీఏ వెలుపల)
శశాంక్ గోయల్ గుడ్ గవర్నెన్స్ వైస్ చైర్మన్
కే.శశాంక ఫ్యూచర్ సిటీ డెవలె్‌పమెంట్ అథారిటీ కమిషనర్
ఎస్.హరీశ్ జెన్‌కో సీఎండీ
నిఖిల మానవహక్కుల కమిషన్ సెక్రటరీ, సీఈవో
ఎస్. వెంకటరావు దేవాదాయశాఖ డైరెక్టర్, యాదగిరిగుట్ట ఈవో
పి.కాత్యాయనీ దేవి సెర్ప్ అదనపు సీఈవో
హేమంత్ సహదేవ్‌రావు జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్
ఫణీంద్రారెడ్డి టీజీఎంఎ్‌సఐడీసీ ఎండీ
కధిరవన్ పంచాయతీ రాజ్ జాయింట్ కమిషనర్
విద్యా సాగర్(నాన్ క్యాడర్) హైదరాబాద్ అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు)
ఉపేందర్ రెడ్డి (నాన్ క్యాడర్) హెచ్‌ఎండీఏ కార్యదర్శి