Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రండి
ABN , Publish Date - Jun 23 , 2025 | 04:43 AM
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం పీసీసీ లీగల్ సెల్ కామారెడ్డి జిల్లా చైర్మెన్ దేవరాజు గౌడ్ ఫోన్‌ను ట్యాపింగ్ చేసినట్లు తేలడంతో విచారణకు హాజరుకావాలని ఆయన్ను సిట్ బృందం ఆదేశించింది.

పీసీసీ లీగల్ సెల్ కామారెడ్డి జిల్లా చైర్మన్ దేవరాజుగౌడ్‌కు సిట్ ఆదేశాలు
కామారెడ్డి, జూన్ 22(ఆంధ్రజ్యోతి): గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం పీసీసీ లీగల్ సెల్ కామారెడ్డి జిల్లా చైర్మెన్ దేవరాజు గౌడ్ ఫోన్‌ను ట్యాపింగ్ చేసినట్లు తేలడంతో విచారణకు హాజరుకావాలని ఆయన్ను సిట్ బృందం ఆదేశించింది. కామారెడ్డిలో పోటీ చేసిన కేసీఆర్‌ను గెలిపించేందుకు కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు ముఖ్య నేతల ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపణలు వచ్చాయి.
నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేయగా ఎన్నికల వ్యవహారాన్ని చూసుకున్న ఆయన సోదరుడు కొండల్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ముఖ్యనేతలపై బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిఘా పెట్టింది. క్రియాశీలకంగా పనిచేసిన దేవరాజు గౌడ్ ఫోన్ ట్యాప్ అయినట్లు సిట్ బృందం గుర్తించింది. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు దేవరాజ్‌కు ఫోన్‌చేసి వారం రోజుల్లో జూబ్లీహిల్స్ పీఎస్‌లో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.