NIMS Hospital: నిమ్స్ మ్యాన్‌హోల్లో శిశువు మృతదేహం!
ABN , Publish Date - Jul 11 , 2025 | 06:18 AM
నిమ్స్ ఆస్పత్రిలోని ఓ మ్యాన్‌హోల్లో నెలలు నిండకుండా పుట్టిన శిశువు మృతదేహం కనిపించడం తీవ్ర కలకలం రేపింది.

పంజాగుట్ట/నిమ్స్, జూలై10(ఆంధ్రజ్యోతి): నిమ్స్ ఆస్పత్రిలోని ఓ మ్యాన్‌హోల్లో నెలలు నిండకుండా పుట్టిన శిశువు మృతదేహం కనిపించడం తీవ్ర కలకలం రేపింది. మరుగుదొడ్డిలో నీళ్లు పోకపోవడంతో.. అది సరిచేసేందుకు మ్యాన్‌హోల్‌ను తెరిచిచూడగా ఓ మగబిడ్డ మృతదేహం లభ్యమైంది. ఆస్పత్రి పాత భవనంలోని ఆర్థో విభాగం సమీపంలోని ఈ ఘటన వెలుగుచూసింది.
ఆస్పత్రికి వచ్చిన గుర్తు తెలియని గర్భిణి, టాయ్‌లెట్‌కు వెళ్లినప్పుడు నెలలు నిండకుండానే ప్రసవించి ఉంటుందని భావిస్తున్నారు. కాగా పోలీసులొచ్చి శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ గర్భిణి ఎవరు? అనేది గుర్తించేందుకు ఆస్పత్రిలోని సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.