Shanti Kumari: ఎంసీహెచ్చార్డీ వైస్ చైర్మన్‌గా శాంతికుమారి
ABN , Publish Date - Apr 29 , 2025 | 04:26 AM
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి రైటర్ అవుతున్న శాంతికుమారిని.. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీహెచ్చార్డీ) వైస్ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి రైటర్ అవుతున్న శాంతికుమారిని.. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీహెచ్చార్డీ) వైస్ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ఎం.రఘునందన్‌రావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎంసీహెచ్చార్డీ వైస్ చైర్మన్‌తోపాటు డైరెక్టర్ జనరల్ (డీజీ)గా అదనపు బాధ్యతలను కూడా ఆమెకు అప్పగించారు.
శాంతికుమారి ఈ నెల 30న పదవీ విరమణ చేశాక ఈ బాధ్యతలను చేపడతారు. ఇప్పటివరకు ఎంసీహెచ్చార్డీ డీజీగా ఉన్న శశాంక్ గోయల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) వైస్ చైర్మన్‌గా బదిలీ అయిన నేపథ్యంలో.. ఆ బాధ్యతలను శాంతికుమారికి అప్పగించారు.
ఇవి కూడా చదవండి
Jagga Reddy: జగ్గారెడ్డి మాస్ డైలాగ్.. రాజకీయాల్లో విలన్ మేమే, హీరోలం మేమే
Meta AI Chatbot: అశ్లీలతకు అడ్డాగా మారిన మెటా ఏఐ చాట్ బాట్స్