Share News

Shamshabad Airport: ఎమిరేట్స్‌ విమానంలో తెలుగులోనూ మెనూ

ABN , Publish Date - Jul 12 , 2025 | 06:04 AM

శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి దుబాయ్‌ వెళ్తున్న ఎమిరేట్స్‌ విమానంలో ప్రయాణికుల సౌకర్యార్థం మెనూను తెలుగులోనూ ముద్రించారు.

Shamshabad Airport: ఎమిరేట్స్‌ విమానంలో తెలుగులోనూ మెనూ

  • సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన ఓ ప్రయాణికుడు

శంషాబాద్‌ రూరల్‌, జూలై 11 (ఆంధ్రజ్యోతి): శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి దుబాయ్‌ వెళ్తున్న ఎమిరేట్స్‌ విమానంలో ప్రయాణికుల సౌకర్యార్థం మెనూను తెలుగులోనూ ముద్రించారు. ఇంగ్లిషు, అరబిక్‌తో పాటు తెలుగు భాషలో ఉన్న ఆ మెనూను ఓ ప్రయాణికుడు సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఓ విదేశీ విమానయాన సంస్థ తెలుగులోనూ మెనూ ముద్రించడం విశేషం అని ఆయన పేర్కొన్నారు.


తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సముదాయాల్లో తెలుగులోనూ బోర్డులు పెడితే బాగుటుందని అభిప్రాయపడ్డారు. కాగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు రాకపోకలు సాగించే అంతర్జాతీయ విమాన సర్వీసులన్నింటిలోనూ మెనూను తెలుగులో కూడా ముద్రిస్తున్నారని తెలిసింది.

Updated Date - Jul 12 , 2025 | 06:04 AM