Seethakka: మహిళా సంఘాలకు ప్రోత్సాహకాలు
ABN , Publish Date - Apr 27 , 2025 | 03:52 AM
రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రకాల ప్రోత్సాహకాలు అందిస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. మహిళా సంఘాల సక్సెస్ స్టోరీలను పుస్తక రూపంలో ఇవ్వడం ద్వారా ఇతరులకు స్ఫూర్తి కలుగుతుందని పేర్కొన్నారు.

పుస్తక రూపంలో వాళ్ల సక్సెస్ స్టోరీలు ఇవ్వాలి
జనజీవనంలోకి వచ్చిన తర్వాతే నా చదువు కొనసాగింపు: సీతక్క
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రకాల ప్రోత్సాహకాలు అందిస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. మహిళా సంఘాల సక్సెస్ స్టోరీలను పుస్తక రూపంలో ఇవ్వడం ద్వారా ఇతరులకు స్ఫూర్తి కలుగుతుందని పేర్కొన్నారు. భారత్ సదస్సుకు హాజరైన విదేశీ ప్రతినిధులను వెంటపెట్టుకుని శనివారం రాత్రి శిల్పారామంలోని ఇందిరా మహిళా శక్తి బజార్‌ను మంత్రి సీతక్క సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె కుమ్మరి చక్రంపై కుండ తయారీ చేయగా.. వృత్తిదారుకు చెందిన బాలిక కుండ తయారీలో మంత్రికి మెళకువలు నేర్పించారు. అనంతరం సీతక్క మాట్లాడుతూ చదువును నిర్లక్ష్యం చేయకుండా మంచిగా చదువుకోవాలని బాలికకు సూచించారు.
మహిళా సంఘానికి చెందిన రాధ తన జీవిత స్టోరీని పరిచయం చేయడం సంతోషంగా ఉందని, ఆమె ఐకేపీ సెంటర్ నడుపుకొంటూ చదువుకోవాలనుకోవడం అభినందనీయమన్నారు. ఆమెలో తనను చూసుకుంటున్నానని, తాను కూడా పదో తరగతితో చదువు ఆపేశానని, ఆజ్ఞాతం వీడి జనజీవనంలోకి వచ్చిన తర్వాత తిరిగి చదువు కొనసాగించినట్లు చెప్పారు. ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం, పీహెచ్‌డీ చేశానని తెలిపారు. రాష్ట్రంలోని మహిళా సంఘాల సక్సెస్ స్టోరీలను విదేశీయులు ఇక్కడికి వచ్చి వింటున్నారని, రాష్ట్రానికి ఎవరు వచ్చినా మిమ్మల్ని కలవకుండా వెళ్లే పరిస్థితి లేదన్నారు.
ఇవి కూడా చదవండి
Butta Renuka: ఆస్తుల వేలం.. వైసీపీ మాజీ ఎంపీకి బిగ్ షాక్
Human Rights Demad: కాల్పులు నిలిపివేయండి.. బలగాలను వెనక్కి రప్పించండి.. పౌరహక్కుల నేతలు డిమాండ్
Read Latest Telangana News And Telugu News