RTC Passengers Insurance: ఆర్టీసీ బస్సులలో ప్రయాణీకులకు ఇన్స్యూరెన్స్ ఎందుకు లేదు.?
ABN , Publish Date - Nov 03 , 2025 | 11:37 AM
ఆర్టీసీ బస్సు ఎక్కితే సేఫ్ అని అంటారు. కానీ, నేటి ఖానాపూర్ గేట్ మీర్జాగూడ ప్రమాదంలా ఏదైనా జరిగితే? ప్రయాణికులకు ఇన్సూరెన్స్ లేదు! టికెట్‌లో రూ.1 'సేఫ్టీ సెస్' కడుతున్నా.. అది బీమా కాదు. కేవలం ఎక్స్-గ్రాషియా ఫండ్
ఇంటర్నెట్ డెస్క్: ఆర్టీసీ బస్సు ఎక్కితే సేఫ్ అని అంటారు. కానీ, నేటి ఖానాపూర్ గేట్ దగ్గర మీర్జాగూడ ప్రమాదంలా ఏదైనా జరిగితే? ప్రయాణికులకు ఇన్సూరెన్స్ లేదు! టికెట్‌లో రూ.1 'సేఫ్టీ సెస్' కడుతున్నా.. అది బీమా కాదు. కేవలం ఎక్స్-గ్రాషియా ఫండ్ మాత్రమే. మరి బాధితులు, వారి మీద ఆధారపడిన కుటుంబాల ఆర్థిక పరిస్థితి ఏంటిన్నది ఇప్పుడు జనం అడుగుతున్న ప్రశ్న.
మోటార్ వెహికల్ యాక్ట్ 1988 ప్రకారం ప్రైవేట్ బస్సులు, ట్రావెల్స్ బస్సుల ప్రయాణికులకు బీమా తప్పనిసరి (అదనపు ఎండార్స్‌మెంట్). కానీ ఆర్టీసీ లాంటి ప్రభుత్వ రవాణా వ్యవస్థలకు మినహాయింపు ఎందుకని ఇప్పుడు జనం నిలదీస్తున్నారు. అయితే, 10 వేల పైచిలుకు బస్సులకు ఏటా కోట్ల రూపాయల ప్రీమియం కట్టడం ఆర్టీసీకి తలకుమించిన భారం అంటూ సంస్థ ప్రతినిధులు పలు సందర్భాల్లో తేల్చి చెప్పారు.
ఆర్టీసీ టికెట్‌లో బీమా యాడ్ చేయాలని.. దీని కోసం టికెట్ ధరలో రూ.2 నుంచి 5 వసూలు చేసి బీమా తీసుకోవాలని 2010 ఆలోచన చేసినప్పటికీ వివిధ కారణాలతో అమలు చేయలేకపోయారు. అయితే, ఏవైనా ప్రమాదాలు సంభవిస్తే, బీమా లేకపోయినా ఎక్స్-గ్రేషియా (ప్రభుత్వ సహాయం) ఉంది. మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి రూ. 5 లక్షలు (ప్రభుత్వం) ఇంకా, రూ. 3-5 లక్షలు (ఆర్టీసీ ఫండ్) కలిపి మొత్తం రూ. 8 నుంచి 10 లక్షలు వరకు ఆర్టీసీ ప్రయాణీకులకు నష్టపరిహారం అందిస్తున్నారు.
అయితే, ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి సర్కారు తక్షణమే స్పందించింది. సహాయక చర్యల్ని సీఎం స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి ఐదు లక్షలు, గాయపడ్డవారికి రెండు లక్షలు తక్షణ సాయం ప్రకటించారు.
ఇవి కూడా చదవండి..
Infectious Diseases: భారత్‌లో పెరుగుతున్న అంటువ్యాధులు