Huzurabad: గురుకుల హాస్టల్‌లో ఎలుకల కలకలం
ABN , Publish Date - Jul 26 , 2025 | 05:03 AM
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లోని సైదాపూర్ బీసీ వెల్ఫేర్ హాస్టల్‌లో ఇద్దరు విద్యార్థులను ఎలుకలు కొరికాయి.

ఇద్దరు విద్యార్థులకు గాయాలు
హుజూరాబాద్, జూలై 25(ఆంధ్రజ్యోతి): కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లోని సైదాపూర్ బీసీ వెల్ఫేర్ హాస్టల్‌లో ఇద్దరు విద్యార్థులను ఎలుకలు కొరికాయి. దీంతో ఆ ఇద్దరితో పాటు గదిలో ఉన్న 10మంది విద్యార్థులను హుజూరాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించి టీటీ ఇంజక్షన్లు ఇప్పించారు. హాస్టల్‌కు సమీపంలో రైస్ మిల్లులు ఉండడంతో ఎలుకలు వస్తున్నాయని, బోన్లు ఏర్పాటు చేస్తున్నామని ప్రిన్సిపాల్ రాణి తెలిపారు. విద్యార్థులు క్షేమంగా ఉన్నారని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నా జోలికొస్తే అడ్డంగా నరికేస్తా..
బాలికపై అత్యాచారం.. గర్భం దాల్చిందని బతికుండగానే..
For Telangana News And Telugu News