Rahul Gandhi: భారత్ సమ్మిట్‌లో రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Apr 26 , 2025 | 04:30 PM
Rahul Gandhi: భారత్ సమ్మిట్‌లో రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు వేశారు. ప్రపంచ వ్యాప్తంగా రాజకీయాలు ఎంతో మారిపోయాయి. పదేళ్ల క్రితం నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు’ అంటూ మండిపడ్డారు. ఉగ్రదాడి మృతులకు రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు.

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భారత్ సమ్మిట్ 2025 నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం ప్రారంభం అయిన ఈ కార్యక్రమంలో 100 దేశాలకు చెందిన 450 మంది ప్రముఖులు పాల్గొన్నారు. సమ్మిట్ చివరి రోజున ఈ గ్లోబల్ కాన్ఫరెన్స్‌లో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వంపై మండిపాటు వ్యక్తం చేశారు. రాహుల్ మాట్లాడుతూ.. ‘ ప్రపంచ వ్యాప్తంగా రాజకీయాలు ఎంతో మారిపోయాయి. పదేళ్ల క్రితం నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. విపక్షాలను అణగదొక్కడమే అధికార పార్టీకి పనైపోయింది. మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు వేశారు’ అంటూ మండిపడ్డారు.
'వినడం' అంటే ఏమిటో నేర్చుకున్నా
‘ నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజల మాటలు వినడం కంటే మాట్లాడటానికే ప్రాధాన్యత ఇచ్చాను. కానీ యాత్ర సమయంలో అసలైన 'వినడం' అంటే ఏమిటో నేర్చుకున్నాను. యాత్రలో ప్రజలతో మమేకమై వారి సమస్యలను, భావాలను లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేశా. యాత్ర ప్రారంభంలో నా మనసులో సంభాషణలు కొనసాగుతూ ఉండేవి.
క్రమేణా అవి నిశ్శబ్దంగా మారి ఎదుటివారు చెప్పేది మాత్రమే వినడం అలవాటైంది. ఈ క్రమంలో ఒక మహిళ నన్ను కలిసి తన భర్త తనను కొడుతున్నాడని చెప్పింది. ఆమె ఆ విషయం నాకు చెప్పడానికి మాత్రమే వచ్చింది. ఆమె బాధను నేను విన్న తర్వాత, ఆమెలో భయం పోయి ప్రశాంతత కనిపించింది. కేవలం వినడం ద్వారానే ఎంతో మార్పు తీసుకురావచ్చని గ్రహించాను. ప్రజలు చెప్పేది వినడం అనేది ఎంతో ముఖ్యం.’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
Shruti Haasan: పాపం శృతి హాసన్.. సీఎస్‌కే ఓటమిని తట్టుకోలేకపోయింది..
Seema Haider: పాకిస్తాన్ తిరిగి వెళ్లటంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీమా హైదర్