Share News

Rachakonda Police: శభాష్‌ రాచకొండ పోలీస్‌..డయల్‌-100కు తక్షణ స్పందన

ABN , Publish Date - Jul 02 , 2025 | 09:24 AM

డయల్‌-100కు తక్షణమే స్పందించిన రాచకొండ పోలీసులు బాధిత కుటుంబానికి సహాయం చేసి, స్థానికుల అభినందనలు పొంది బేష్‌ అనిపించుకున్నారు.

Rachakonda Police: శభాష్‌ రాచకొండ పోలీస్‌..డయల్‌-100కు తక్షణ స్పందన

- తండ్రి చనిపోయిన ఇద్దరు పిల్లలను.. ప్రభుత్వ స్కూల్లో చేర్పించిన పోలీసులు

హైదరాబాద్‌ సిటీ: డయల్‌-100కు తక్షణమే స్పందించిన రాచకొండ పోలీసులు(Rachakonda Police) బాధిత కుటుంబానికి సహాయం చేసి, స్థానికుల అభినందనలు పొంది బేష్‌ అనిపించుకున్నారు. బాలాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌(Balapur Police Station) పరిధిలో జరిగిన కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు. బాలాపూ ర్‌ గ్రామం నుంచి డయల్‌-100 కాల్‌ వచ్చింది.


విషయం తెలుసుకున్న పెట్రోలింగ్‌ కారు ఇన్‌చార్జి హెడ్‌ కానిస్టేబుల్‌ నరేందర్‌కుమార్‌, హోంగార్డు వెంకటే్‌ష ఘటనా స్థలానికి వెళ్లారు. అక్కడి వెళ్లి విషయం ఆరా తీయగా.. 35ఏళ్ల బాధిత మహిళకు రెండేళ్ల క్రితం భర్త చనిపోవడంతో అప్పటి నుంచి ఆమె మానసికంగా కృంగిపోయింది. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. దాంతో ఆమె ఇద్దరు పిల్లలను స్కూల్లో చేర్పించే పరిస్థితి లేదు. విషయం తెలుసుకున్న స్థానికులు డయల్‌-100 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు.


city5.2.jpg

ఈనేపథ్యంలో బాధితురాలి ఇద్దరు పిల్లలను ప్రభు త్వ పాఠశాలలో ఒకరిని 6వ తరగతిలో, మరొకరిని 5వ తరగతిలో చేర్పించారు. పోలీసులు చేసిన మంచిపనికి స్థానికులు హర్షం వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలిపారు. విషయం తెలుసుకున్న రాచకొండ సీపీ సుధీర్‌బాబు సిబ్బందిని అభినందించినట్లు బాలాపూర్‌ పోలీసులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి.

విద్యార్థుల హెల్త్‌ ప్రొఫైల్‌ రూపొందించాలి

అధికారులు ఉత్సాహంగా పనిచేయాలి

Read Latest Telangana News and National News

Updated Date - Jul 02 , 2025 | 09:24 AM