Headmasters Promotion: రేపట్నుంచి ప్రధానోపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ షురూ
ABN , Publish Date - Aug 01 , 2025 | 05:19 AM
ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల్లోని గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీల పదోన్నతుల ప్రక్రియ

10 రోజుల్లో ముగించేలా షెడ్యూల్ విడుదల
హైదరాబాద్, జూలై 31 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల్లోని గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీల పదోన్నతుల ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభంకానుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ గురువారం ప్రకటించారు. ఆగస్టు 2న వెబ్‌సైట్‌లో ఖాళీల ప్రకటన, 3న అభ్యంతరాల స్వీకరణ, 4, 5 తేదీల్లో స్కూల్ అసిస్టెంట్ల సీనియార్టీ జాబితా, 6న ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులకు స్కూల్ అసిస్టెంట్ల వెబ్ ఆప్షన్ల స్వీకరణ, 7న పదోన్నతు ల ఉత్తర్వుల జారీ ఉంటుంది. ఆతర్వాత ఖాళీల వివరాల ప్రకటన, అభ్యంతరాల స్వీకరణ, తుది జాబితాను ఆగస్టు 8,9 తేదీల్లో ప్రదర్శిస్తారు. స్కూల్ అసిస్టెంట్ పదోన్నతుకోసం ఎస్జీటీల వెబ్ ఆప్షన్ల స్వీకరణ ఆగస్టు 10న ఉంటుంది. 11న పదోన్నతుల ఉత్తర్వులు జారీ చేస్తారు. మొత్తం ప్రక్రియ ఆగస్టు 2న ప్రారంభించి 11న ముగించాలని నవీన్ విద్యాశాఖాధికారులను ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ పర్యటన.. ప్రశాంతి రెడ్డి రియాక్షన్
జగన్ జైలుకు వెళ్తారా అంటే.. లోకేష్ ఏమన్నారంటే..
For More Telangana News And Telugu News