Prabhakar Rao: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణ పేరుతో వేధింపులు
ABN , Publish Date - Jul 24 , 2025 | 02:43 AM
ఫోన్‌ట్యాపింగ్ కేసులో విచారణ పేరుతో సిట్ అధికారులు తనను వేధిస్తున్నారని పేర్కొంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించే దిశలో ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు అడుగులు వేస్తున్నట్లు తెలిసింది.

సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న ప్రభాకర్‌రావు
మధ్యంతర ఉపశమనం రద్దు దిశలో సిట్ అడుగులు
హైదరాబాద్, జూలై 23 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ట్యాపింగ్ కేసులో విచారణ పేరుతో సిట్ అధికారులు తనను వేధిస్తున్నారని పేర్కొంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించే దిశలో ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు అడుగులు వేస్తున్నట్లు తెలిసింది. తనను పలుమార్లు విచారణ పేరుతో సిట్ కార్యాలయానికి పిలిపించారని, గంటల కొద్దీ కూర్చోబెట్టి, మానసికంగా వేధించారని ఆయన కోర్టుకు తెలియజేయనున్నట్లు సమాచారం. అదే సమయంలో.. సిట్ కూడా ప్రభాకర్‌రావు విచారణలో తమకు ఏమాత్రం సహకరించడం లేదని, ఆయనకు ఇచ్చిన మధ్యంతర ఉపశమనాన్ని రద్దుచేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే సిట్ డీసీపీ విజయ్‌కుమార్, ఏసీపీ వెంకటగిరి ఢిల్లీ వెళ్లి.. న్యాయవాదులను కలిసి, వచ్చారు.
వచ్చేనెల 5న సుప్రీంకోర్టులో ప్రభాకర్‌రావు పిటిషన్‌పై తదుపరి విచారణ జరగనుంది. అప్పటి వరకు ఆయనను అరెస్టు చేయవద్దని కోర్టు పోలీసులను ఆదేశించింది. దీంతో.. సిట్ తమ విచారణకు సంబంధించిన వీడియో ఫుటేజీని కోర్టుకు సమర్పించి.. ప్రభాకర్‌రావు ఏమాత్రం సహకరించడం లేదంటూ ఆధారాలను చూపేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు.. ఈ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ని ఈ నెల 24న విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే..! అయితే.. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో తాను రాలేనని, ఈనెల 28న విచారణకు హాజరు కాగలనని పేర్కొంటూ ఆయన సిట్‌కు ఓ లేఖ రాశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దంచికొడుతున్న వాన.. భారీగా ట్రాఫిక్ జామ్
రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు
Read latest Telangana News And Telugu News