Electricity: మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా బంద్.. ఏయే ఏరియాల్లో అంటే..
ABN , Publish Date - Jul 15 , 2025 | 07:20 AM
టీజీఎస్పీడీసీఎల్ వసంతనగర్ సెక్షన్ పరిధిలో చెట్లకొమ్మల తొలగింపు కోసం మంగళవారం పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ వాణి ఓ ప్రకటనలో తెలిపారు. భగత్‌సింగ్‌నగర్ ఫేజ్-2, వసంతనగర్‌లలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు.

- నగరంలో.. నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలివే..
హైదరాబాద్: టీజీఎస్పీడీసీఎల్ వసంతనగర్ సెక్షన్(GSPDCL Vasanthanagar Section) పరిధిలో చెట్లకొమ్మల తొలగింపు కోసం మంగళవారం పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ వాణి ఓ ప్రకటనలో తెలిపారు. భగత్‌సింగ్‌నగర్ ఫేజ్-2, వసంతనగర్‌లలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు.. గోకుల్ ప్లాట్స్ ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 వరకు విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు.
మల్కాజిగిరి: గౌతంనగర్ విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలోని 11 కేవీ దయానంద్‌నగర్ ఫీడర్‌లో మరమ్మతుల కారణంగా మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు వాణీనగర్ మారుతీనగర్ భవానీనగర్, నర్సింహారెడ్డినగర్ పార్టు, తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని వినియోగదారులు సహకరించాలని ఏఈ గోపాల్ కోరారు.
పేట్ బషీరాబాద్: పేట్ బషీరాబాద్(Pet Basheerabad) సబ్‌స్టేషన్ పరిధిలో సాంకేతిక మరమ్మతుల కారణంగా మంగళవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ ఉండదని ఏఈ జ్ఞానేశ్వర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సాయిబాబానగర్, వాజ్‌పాయినగర్, పద్మానగర్ ఫేజ్-2, నాగులకుంట, ఎంఎన్‌రెడ్డినగర్ ఫేజ్-2, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బ్యాంక్ కాలనీ, రాఘవేంద్రకాలనీ, వెంకటేశ్వరకాలనీ, ఎంఎన్‌రెడ్డినగర్ ప్రాంతాల్లో విద్యుత్ ఉండదన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఏఈ కోరారు.
రాయదుర్గం: ఐవీఆర్‌సీఎల్ విద్యుత్ ఫీడర్ పరిధిలో మరమ్మతుల కారణంగా మంగళవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు హిల్‌రిడ్జ్ విల్లాస్, టైమ్స్ హాస్పిటల్, గోపీచంద్ స్టేడియం ప్రాంతాల్లో విద్యుత్ ఉండదని అధికారులు తెలిపారు. అదేవిధంగా మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాక్ ఎన్‌క్లేవ్, బ్రహ్మకుమారీస్, ఎస్‌ఎంఆర్ సింపని, గుడ్‌గవర్‌నెన్స్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ ఉండదన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
మరింత పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
యువతి మోజులో పడి భర్త వేధింపులు ఉరివేసుకొని భార్య ఆత్మహత్య
Read Latest Telangana News and National News