Electricity: ఆ ఏరియాల్లో.. 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కరెంట్ కట్
ABN , Publish Date - Jul 05 , 2025 | 06:59 AM
బంజారాహిల్స్(Banjara Hills) ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ జి.గోపి తెలిపారు.

నగరంలో నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలివే..
హైదరాబాద్: బంజారాహిల్స్(Banjara Hills) ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ జి.గోపి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 11కేవీ రవీంద్ర సొసైటీ మెహర్‌బాబా, జూబ్లీ ఎన్‌క్లేవ్ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లోనూ, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11కేవీ మాదాపూర్ శ్రీచైతన్య కాలేజ్, పవర్ మెక్ ఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు.
గ్రీన్‌ల్యాండ్స్ ఏడీఈ పరిధిలో..
గ్రీన్‌ల్యాండ్స్ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏడీఈ చరణ్‌సింగ్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 11కేవీ బేగంపేట పోస్టాఫీస్, పెద్దమ్మనగర్ ఫీడర్ల పరిధిలోని పలుప్రాంతాల్లోనూ, మధ్యాహ్నం 2 గంటల నుంచి సా యంత్రం 5 గంటల వరకు 11కేవీ స్వరాజ్‌నగర్, ఆదిత్య ఎన్‌క్లేవ్, గ్రీన్‌పార్కు హోటల్ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లోనూ విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు.
కేపీహెచ్‌బీకాలనీ: టీజీఎస్పీడీసీఎల్ వసంతనగర్ సెక్షన్ పరిధిలో డీసీ వర్క్స్ కోసం శనివారం పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ వాణి ఓ ప్రకటనలో తెలిపారు. కేపీహెచ్‌బీ ఓల్డ్ ఆరో ఫేజ్‌లో ఉదయం 9.30 గంటల నుంచి 10 వరకు, న్యూ ఆరోఫేజ్‌లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, గోకుల్ ఫ్లాట్స్‌లో మధ్యాహ్నం 3 గంటల నుంచి 3.30 వరకు విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు.
నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు
ఉప్పల్: చెట్ల కొమ్మల తొలగింపు, విద్యుత్ లైన్ల మార్పులు, ఇతర మ్మరమతుల కారణంగా శనివారం వివిధ ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఉప్పల్ సబ్‌స్టేషన్ ఏఈ ఎం.నిఖిల్(Uppal Substation AE M. Nikhil) తెలిపారు. ఆసియన్ ఫీడర్ పరిధిలోని ఉప్పల్ మెయిన్ రోడ్డు, స్వరూప్ రెడ్డి నగర్, ఆసియన్ థియేటర్ ప్రాంతాలలో ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు కరెంటు సరఫరా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. కల్యాణపురి ఫీడర్ పరిధిలో ఉదయం 11 నుంచి 11.30 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని, వినియోగదారులు తమ సిబ్బందితో సహకరించాలని ఆయన కోరారు.
వసంతపురి సబ్‌స్టేషన్ పరిధిలో
మల్కాజిగిరి: వసంతపురి విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలోని 11 కేవీ గీతాభవానీ ఫీడర్ పరిధిలో విద్యుత్ మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. మధ్యాహ్నం 2 నుంచి 2.30 వరకు వెంకటేశ్వరనగర్, రాఘవేంద్రమఠం, దుర్గానగర్, పటేల్‌నగర్, హైదర్‌నగర్, తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని వినియోగదారులు సహకరించాలని ఏఈ గోపాల్ నేడొక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
గాజులరామారం: గాజులరామారం విద్యుత్ సబ్-స్టేషన్ పరిధిలోని మగ్దూంనగర్, జగద్గిరిగుట్ట, శ్రీరామ్‌నగర్, ఉషా ముళ్ల పూడి 11 కేవీ ఫీడర్ల పరిధిలో ఈ కింది ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని ఏఈ చైతన్య భార్గవ్ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మగ్దూంనగర్, ఎన్టీఆర్‌నగర్, నాగార్జున స్కూల్ లేన్ శ్రీరామ్‌నగర్ బేకరీగడ్డ, శ్రీరామ్‌నగర్-ఏబీల్లో విద్యుత్‌ను నిలిపి వేస్తామని ఏఈ పేర్కొన్నారు.
పేట్‌బషీరాబాద్ సబ్ స్టేషన్ పరిధిలో...
విద్యుత్ సంబంధిత మరమ్మతుల కారణంగా పేట్‌బషీరాబాద్ సబ్ స్టేషన్ పరిధిలో శనివారం ఈ కింది ప్రాంతాలో విద్యుత్ సరఫరా ఉండదని ఏఈ జ్ఞానేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి 10.30 గంటల వరకు దండమూడి ఎన్‌క్లేవ్,, సురక్ష ఆస్పత్రి, వీఎ్‌సఎస్ నందదీప్, పిస్తా హౌస్, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ప్రాంతాల్లో కరెంట్ ఉండదని ఏఈ వెల్లడించారు.
చందానగర్: చందానగర్ సబ్‌స్టేషన్ పరిధిలోని 11కెవి ఫీడర్ మరమ్మతుల కారణంగా శనివారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు హైదనగర్ ఏఈ తెలిపారు. 11కెవి లక్ష్మీనగర్ ఫాడర్ ప్రాంగణంలో ఉదయం 10 గంటల నుంచి 10.30 వరకు చందానగర్ రత్నదీప్, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్, లక్ష్మీనగర్, బుద్ద అపార్టెమెంట్స్, నమహా అపార్ట్‌మెంట్స్ ప్రాంగణంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని తెలిపారు. 11కెవి శ్రీలాగార్డెన్స్ ప్రాంగణంలో ఉదయం 11.30 నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి.
విశాఖ వందేభారత్‌కు ఇకపై 20 బోగీలు
నిరుద్యోగుల కష్టాలు కనబడట్లేదా...
Read Latest Telangana News and National News