Share News

Electricity: హైదరాబాద్‏లో.. ఆ ఏరియాల్లో 10గంటల నుంచి కరెంట్ కట్..

ABN , Publish Date - Jul 16 , 2025 | 07:00 AM

మరమ్మతుల కారణంగా బంజారాహిల్స్‌ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో బుధవారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ జి.గోపి తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు టీవీ-5, శ్రీనగర్‌ కాలనీ, జలగం వెంగళరావు పార్క్‌, ఐవీఆర్సీఎల్‌ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు.

Electricity: హైదరాబాద్‏లో.. ఆ ఏరియాల్లో 10గంటల నుంచి కరెంట్ కట్..

- నగరంలో.. నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలివే..

పంజాగుట్ట(హైదరాబాద్): మరమ్మతుల కారణంగా బంజారాహిల్స్‌ ఏడీఈ(Banjara Hills ADE) పరిధిలోని పలు ప్రాంతాల్లో బుధవారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ జి.గోపి తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు టీవీ-5, శ్రీనగర్‌ కాలనీ, జలగం వెంగళరావు పార్క్‌, ఐవీఆర్సీఎల్‌ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫిలింనగర్‌, ఎల్లారెడ్డిగూడ, బంజారాహిల్స్‌ రోడ్‌నంబర్‌-1, పంజాగుట్ట మోడల్‌ హౌస్‌ ఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా ఉండదని పేర్కొన్నారు.


కేపీహెచ్‌బీకాలనీ: చెట్లకొమ్మల తొలగింపు పనుల కోసం టీజీఎ్‌సపీడీసీఎల్‌ వసంతనగర్‌, బాలాజీనగర్‌ సెక్షన్ల పరిధిలోని ఈ కింది ప్రాంతాల్లో బుధవారం విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తున్నట్టు ఏఈలు వాణి, భీమలింగప్ప వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు.

వసంతనగర్‌లో..

భగత్‌సింగ్‌నగర్‌ ఫేజ్‌-2, వసంతనగర్‌లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, గోకుల్‌ ప్లాట్స్‌లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సరఫరా ఉండదన్నారు.


బాలాజీనగర్‌లో..

కేపీహెచ్‌బీ 15వ ఫేజ్‌, కైత్లాపూర్‌, శ్రీరామ్‌ నగర్‌, రాఘవేంద్ర బస్తీలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, కేపీహెచ్‌బీ నాలుగోఫేజ్‌, లక్కీ రెస్టారెంట్‌ ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్‌ ఉండని తెలియజేశారు.

చిక్కడపల్లి: ఆజామాబాద్‌ డివిజన్‌ పరిధిలో బుధవారం విద్యుత్‌ సరఫరా ఉండదని ఏడీఈ నాగేశ్వరరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. రెడ్‌బిల్డింగ్‌, బాలాజీనగర్‌ పరిధుల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, అడిక్‌మెట్‌ పరిఽఽధిలో 11.30 నుంచి 1 వరకు, ఎల్‌ఎన్‌నగర్‌ పరిధిలో మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు విద్యుత్‌ సరఫరా ఉండదని ఏడీఈ పేర్కొన్నారు.


రామంతాపూర్‌: రామంతాపూర్‌ సబ్‌ స్టేషన్‌ పరిధిలోని దూరదర్శన్‌ ఫీడర్‌ పరిధిలో సీడీటీఐ, ఎన్‌ఎండీసీ, రామంతాపూర్‌ ప్రధాన రహదారి, దూరదర్శన్‌ క్వార్టర్స్‌, హోమియోపతి ఆస్పత్రి, కళాశాల ప్రాంతాలలో ఈ నెల 16న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్‌ సరఫరా ఉండదని సంబంధిత ట్రాన్స్‌కో ఏఈ కిరణ్‌కుమార్‌ తెలిపారు.

సైనిక్‌పురి సబ్‌స్టేషన్‌ పరిధిలో..

కాప్రా: చెట్ల కొమ్మల తొలగింపు, ఇతర మరమ్మతుల కారణంగా కల్యాణ్‌ గార్డెన్‌ ఫీడర్‌ పరిధిలోని హస్తినాపురి, సాయిపురి, హెచ్‌ఎంటీ బేరింగ్స్‌ కాలనీ, సైనిక్‌పురి, నిర్మల్‌నగర్‌ పరిసర ప్రాంతాలలో, ఎల్లారెడ్డిగూడ ఫీడర్‌ పరిధిలోని అరున్‌నగర్‌, శ్రీనగర్‌, వినాయక్‌నగర్‌, గణే్‌షనగర్‌, జమ్మిగడ్డ, ఆర్టీసీ కాలనీ, సీఎ్‌సనగర్‌, మల్లికార్జుననగర్‌, కాప్రా, ఎల్లారెడ్డిగూడ హరితా ఎన్‌క్లేవ్‌ పరిసర ప్రాంతాలలో బుధవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటవరకు, శ్రీరామ్‌నగర్‌ ఫీడర్‌ పరిధిలోని గాంధీనగర్‌, బాలాజీ ఎన్‌క్లేవ్‌, అరుల్‌ కాలనీ, శ్రీనివాసనగర్‌, రామ్‌దా్‌సనగర్‌, లక్ష్మీఎవెన్యూ, శ్రీరామ్‌నగర్‌, ఆదిత్యనగర్‌ పరిసర ప్రాంతాలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, శాలివాహన ఫీడర్‌ పరిధిలోని శాలివాహన ఎన్‌క్లేవ్‌, కృష్ణానగర్‌, సాయిప్రియ కాలనీ, అశోక్‌ కాలనీ, ఎస్టీ కాలనీ పరిసర ప్రాంతాలలో మధ్యాహ్నం 2 నుంచి 3.30 వవరకు, జనప్రియ ఫీడర్‌ పరిధిలోని జనప్రియ, తిరుమల శివపురి పరిసర ప్రాంతాలలో 3.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్టు సైనిక్‌పురి సబ్‌స్టేషన్‌ ఏఈ రామకృష్ణ తెలిపారు.


చెన్నాపూర్‌ 11 కేవీ ఫీడర్‌ పరిధిలో..

బిట్స్‌ పిలానీ: చెన్నాపూర్‌ 11 కేవీ ఫీడర్‌లో చెట్ల కొమ్మలను కత్తిరించడం, విద్యుత్‌ మెయింటనెన్స్‌ పనుల కారణంగా సీఆర్‌పీఎఫ్‌, అరుంధతినగర్‌, మల్కారం, గోశాల, డంపింగ్‌ యార్డు ప్రాంతాల్లో బుధవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నామని బాలాజీనగర్‌ విద్యుత్‌ ఏఈ సాంబశివరావు తెలిపారు.

city1.2.jpg

బౌద్ధనగర్‌: సీతాఫల్‌మండి విద్యుత్‌ కార్యాలయం చిలకలగూడ గాంధీబొమ్మ, పోచమ్మ టెంపుల్‌ ఫీడర్‌ పరిధిలోని బొందలగడ్డ, మైలార్‌గడ్డ, మసీద్‌ ఏరియా, కిందిబస్తీ, వెస్లీచర్చి, గీత నర్సింగ్‌హోమ్‌, దూద్‌బావి, చింతబావి, చిలకలగూడ మెయిన్‌రోడ్డు, శ్రీదేవీ థియేటర్‌ లైన్‌ ప్రాంతాల్లో బుధవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నామని ఏడీఈ మహే్‌షకుమార్‌, ఏఈ శ్రీకాంత్‌ తెలిపారు. సీతాఫల్‌మండి ఫీడర్‌ పరిధిలో దత్తాత్రేయ ఆలయం, జోషి కాంపౌండ్‌, ఎస్‌వీఎస్‌ లైన్‌, ప్రగతి స్కూల్‌ ఏరియా, మోర్‌ సూపర్‌మార్కెట్‌, డీబీఆర్‌ వెనుక ప్రాంతం, చిలకలగూడ మెయిన్‌రోడ్డులో బుధవారం మధ్యాహ్నం రెండుగంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విద్యుత్‌ సరఫరా ఉండదని వారు తెలిపారు.


పేట్‌బషీరాబాద్‌: కొంపల్లి విద్యుత్‌ సబ్‌-స్టేషన్‌ పరిధిలో చెట్ల కొమ్మల తొలగింపు పనుల కారణంగా బుధవారం ఈ కింది ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా ఉండదని ఏఈ శ్రీనివాసులు తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నందక ఆస్పత్రి రోడ్డు, జీఎల్‌ఆర్‌ విల్లాస్‌, సురేఖ సురక్ష ఆస్పత్రి, సెంట్రల్‌ పార్కు, పురపాలక సంఘం, కొంపల్లి గ్రామం పరిధిలో కరెంట్‌ ఉండదన్నారు.

గాజులరామారం సబ్‌స్టేషన్‌ పరిధిలో..

గాజులరామారం : గాజులరామారం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలోని వివేకానంద్‌ నగర్‌, రోడా మిస్ర్తి నగర్‌ మెయిన్‌ రోడ్డు ప్రాంతాల్లో బుధవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు విద్యుత్‌ ఉండదని ఏఈ చైతన్య భార్గవ్‌ తెలిపారు. అలాగే, మధ్యాహ్న 12 నుంచి 2 గంటల వరకు ఇందిరానగర్‌, ఉషోదయ కాలనీ ఫేజ్‌-1,2, ఉషాముళ్లపూడి వెనుకలేన్‌, ఇందిరానగర్‌ తదితర ప్రాంతాల్లో కరెంట్‌ ఉండదని ఏఈ పేర్కొన్నారు.


రాయదుర్గం: ప్రశాంతిహిల్స్‌ 11కేవీ విద్యుత్‌ ఫీడర్‌ పరిధిలో విద్యుత్‌ లైన్ల మరమ్మతుల కారణంగా బుధవారం పలు ప్రాంతాల్లో విదుత్‌ సరఫరా ఉండదని అధికారులు తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రశాంతిహిల్స్‌, ఎంజేఆర్‌ దాబా ప్రాంతాల్లో విద్యుత్‌ ఉండదన్నారు. రాయదుర్గం విద్యుత్‌ ఫీడర్‌ పరిధిలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాయదుర్గం, మధురానగర్‌, పోలీ్‌సస్టేషన్‌ ప్రాంతాల్లో విద్యుత్‌ ఉండదని అధికారులు వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి.

స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

అంతర్జాతీయ కెమిస్ర్టీ ఒలింపియాడ్‌లో నారాయణ విద్యార్థికి పతకం

Read Latest Telangana News and National News

Updated Date - Jul 16 , 2025 | 07:00 AM