Share News

Power Bills: ఆరు నెలలుగా కరెంట్‌ బిల్లులు కడ్తలేరు!

ABN , Publish Date - Feb 09 , 2025 | 04:35 AM

పలువురు వినియోగదారులు కరెంట్‌ను వాడుకుంటూ బిల్లులు మాత్రం చెల్లించకపోతుండడంతో బకాయిలు గుట్టల్లా పెరుగుతున్నాయి.

Power Bills: ఆరు నెలలుగా కరెంట్‌ బిల్లులు కడ్తలేరు!

  • రూ.50 వేలకు మించిన వారి బకాయిలు రూ.30,777 కోట్లు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): పలువురు వినియోగదారులు కరెంట్‌ను వాడుకుంటూ బిల్లులు మాత్రం చెల్లించకపోతుండడంతో బకాయిలు గుట్టల్లా పెరుగుతున్నాయి. డిస్కమ్‌లకు ఆరు నెలలుగా వివిధ కేటగిరిల వినియోగదారులు రూ.50వేలపైన చెల్లించాల్సిన బకాయిలు అక్షరాలా రూ. 30,777.65 కోట్లకు చేరాయి. ఇందులో దక్షిణ డిస్కమ్‌(ఎస్పీడీసీఎల్‌-హైదరాబాద్‌)కు రూ.17,405.04 కోట్లు, ఉత్తర డిస్కమ్‌(ఎన్పీడీసీఎల్‌-వరంగల్‌)కు రూ. 13,372.61 కోట్ల బకాయిలు వినియోగదారుల నుంచి రావాల్సి ఉంది. రూ.50 వేల పైన కరెంట్‌ బిల్లులు కట్టాల్సిన సంబంధిత మొత్తం వివరాలను డిస్కమ్‌లు తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి(టీజీఆర్‌సీ)కి అందించాయి.


ఈ వార్తలు కూడా చదవండి

MLC Kavitha: కాంగ్రెస్‌ ఆరోపణల్లో నిజం లేదు.. కేసీఆర్ ఎంతో కష్టపడ్డారు

Nandamuri Balakrishna: నాన్న ఆశీర్వాదం వల్లే పద్మ భూషణ్: బాలకృష్ణ

Supreme Court: ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్‌.. సుప్రీం కీలక వ్యాఖ్యలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 09 , 2025 | 04:35 AM