Ponnam Prabhakar: బీసీ బిల్లుపై ప్రధానిని కలుద్దాం.. అపాయింట్‌మెంట్ తీసుకోండి!
ABN , Publish Date - Jun 24 , 2025 | 04:38 AM
బీజేపీ రాజ్యసభ సభ్యుడు, బీసీ నేత ఆర్.కృష్ణయ్య అంటే నాకు అపార గౌరవముంది. ఒక తమ్ముడిగా ఆయనను కోరుతున్నా.

బీజేపీ ఎంపీ ఆర్.కృష్ణయ్యను కోరిన మంత్రి పొన్నం
హైదరాబాద్, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): ‘బీజేపీ రాజ్యసభ సభ్యుడు, బీసీ నేత ఆర్.కృష్ణయ్య అంటే నాకు అపార గౌరవముంది. ఒక తమ్ముడిగా ఆయనను కోరుతున్నా.. ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ ఆయన తీసుకుంటే విద్య, ఉద్యోగాలు, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులపైనా అందరం వెళ్లి కలుద్దాం..’ అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతిపాదించారు. బీసీల గురించి మాట్లాడే అర్హత బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు లేదని ఆయన విమర్శించారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో బీసీల గురించి ఆమె మాట్లాడి ఉంటే.. ఇప్పుడు ఆమెకు బీసీల గురించి మాట్లాడే అర్హత ఉండేదన్నారు.