Fertility Scam: సృష్టి ఫెర్టిలిటీ కేసులో ముగ్గురి విచారణ
ABN , Publish Date - Aug 03 , 2025 | 04:24 AM
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ మోసం కేసులో ముగ్గురు నిందితులను గోపాలపురం పోలీసులు ఇంటరాగేట్ చేశారు. తమ కస్టడీలో ఉన్న డాక్టర్ నమ్రతను, చంచల్‌గూడ జైలు నుంచి తీసుకొచ్చిన విశాఖ సృష్టి కేంద్రం మేనేజర్ కళ్యాణిని, మరో నిందితురాలు సంతోషిని నార్త్‌జోన్ కార్యాలయంలో ఒకే చోట ఉంచి ప్రశ్నించారు.

డాక్టర్ నమ్రత, కళ్యాణి, సంతోషిలను ప్రశ్నించిన పోలీసులు
అడ్డగుట్ట, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ మోసం కేసులో ముగ్గురు నిందితులను గోపాలపురం పోలీసులు ఇంటరాగేట్ చేశారు. తమ కస్టడీలో ఉన్న డాక్టర్ నమ్రతను, చంచల్‌గూడ జైలు నుంచి తీసుకొచ్చిన విశాఖ సృష్టి కేంద్రం మేనేజర్ కళ్యాణిని, మరో నిందితురాలు సంతోషిని నార్త్‌జోన్ కార్యాలయంలో ఒకే చోట ఉంచి ప్రశ్నించారు. ఫెర్టిలిటీ సెంటర్ ప్రారంభం, అండాలు, స్మెర్మ్ సేకరణ, చిన్నారుల విక్రయంపై ప్రశ్నించినా డాక్టర్ నమ్రత సహకరించలేదని సమాచారం. డాక్టర్ నమ్రత గతంలో జైలుకు వెళ్లి వచ్చి ఉండటంతో తప్పించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఏజెంట్ సంతోషి ద్వారా ఇప్పటి వరకు ఎంత మంది దంపతులు వచ్చారు, ఎంత మంది పిల్లలను విక్రయించారనే విషయాలపై పోలీసులు ఆరా తీశారు. ఆస్పత్రి నుంచి సీజ్ చేసిన రికార్డుల్లో ఉన్న వారి వివరాలు, కేసుల గురించి అడగ్గా గుర్తు లేదంటూ డాక్టర్ నమ్రత తప్పించుకునే యత్నం చేసినట్లు తెలిసింది.
భారీగా ఇళ్లు, ఫామ్ హౌస్‌ల కొనుగోలు
దంపతులను మోసం చేసి సంపాదించిన డబ్బుతో నమ్రత మియాపూర్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, యూస్‌ఫగూడతోపాటు ఏపీలో ఫామ్‌హౌ్‌సలు, ఇళ్లు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. నమ్రత గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించి ఏజెంట్ల సహకారంతో పేద మహిళలను ఉచ్చులోకి దింపినట్లు గుర్తించారు. పేద మహిళలను విశాఖ పట్నం, విజయవాడకు తరలించి వారికి పుట్టిన చిన్నారులను సరోగసీ పేరుతో దంపతులకు విక్రయాలు చేస్తున్నట్లు పోలీసులు తేల్చారు. ఈ కేసుకు సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని డీసీపీ రేష్మి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కాంగ్రెస్ మాత్రమే మోదీని కుర్చీ నుంచి దింపగలదు: రేవంత్‌రెడ్డి
ప్రభుత్వ సొమ్ము తిన్నవాళ్లను తిరిగి కక్కిస్తాం.. మహేష్ గౌడ్ స్ట్రాంగ్ వార్నింగ్
Read latest Telangana News And Telugu News