పధాని వైఖరితో ప్రజాస్వామ్యం అపహాస్యం
ABN , Publish Date - May 20 , 2025 | 05:34 AM
ప్రధాని మొండి వైఖరితో ప్రజాస్వామ్యం అపహాస్యమైందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ.రాఘవులు విమర్శించారు.

ప్రతిపక్ష ఎంపీల ఎంపికలో కేంద్రం విఫలం:రాఘవులు
యాదాద్రి, రాంనగర్, మే 19(ఆంధ్రజ్యోతి): ప్రధాని మొండి వైఖరితో ప్రజాస్వామ్యం అపహాస్యమైందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ.రాఘవులు విమర్శించారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరిలోని పార్టీ కార్యాలయంలో పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహాన్ని రాఘవులు ఆవిష్కరించి మాట్లాడారు. ఉగ్రవాదంపై దేశ వైఖరిని ప్రపంచానికి తెలిపేందుకు పంపే ప్రతిపక్ష ఎంపీల ఎంపికలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రతిపక్ష ఎంపీలను ప్రధాని ఎంపిక చేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేగాక రాజకీయ లబ్ధి కోసం పాకులాడటమేనని ధ్వజమెత్తారు.
దేశంలోని ఆయా పార్టీల మధ్య అంతర్గత చిచ్చురేపేందుకు ఆలోచన చేశారని, ప్రతిపక్షాలతో ఇప్పటివరకు సమావేశం కూడా ఏర్పాటు చేయలేదన్నారు. పీడిత ప్రజల కోసం పోరాడిన పుచ్చలపల్లి సుందరయ్య ఆదర్శనేత అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ కొనియాడారు. సీపీఎం గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం సుందరయ్య పార్కులో పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి వేడుకల్లో జాన్‌వెస్లీ మాట్లాడారు.