PM Narendra Modi: మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు
ABN , Publish Date - Jul 01 , 2025 | 03:54 AM
తెలంగాణలోని సిగాచి పరిశ్రమలో పేలుడు ఘటనలో పలువురు కార్మికులు మృతి చెందడం అత్యంత బాధాకరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

సహాయక చర్యలకు సహకారం: కిషన్‌రెడ్డి
న్యూఢిల్లీ, జూన్ 30 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణలోని సిగాచి పరిశ్రమలో పేలుడు ఘటనలో పలువురు కార్మికులు మృతి చెందడం అత్యంత బాధాకరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘‘తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. మృతుల బంధువులకు పీఎంఎన్‌ఆర్‌ఎ్‌ఫ నుంచి రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు ఎక్స్‌గ్రేషియా అందిస్తాం’ అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
సిగాచి పరిశ్రమలో పేలుడు సంభవించి కార్మికులు చనిపోవడంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలకు సంపూర్ణ సహకారం అందించాలని కేంద్ర సంస్థలను ఆదేశించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.