Share News

Rajendranagar: పీజీ, పీహెచ్‌డీలో స్టైపండ్‌ను పెంచాలని వ్యవసాయ వర్సిటీ విద్యార్థుల నిరసన

ABN , Publish Date - Jun 24 , 2025 | 04:45 AM

ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పీజీ, పీహెచ్‌డీ చదువుతున్న విద్యార్థులు తమకు ప్రతి నెలా చెల్లిస్తున్న స్టైపండ్‌ను పెంచాలని డిమాండ్‌ చేశారు.

Rajendranagar: పీజీ, పీహెచ్‌డీలో స్టైపండ్‌ను పెంచాలని వ్యవసాయ వర్సిటీ విద్యార్థుల నిరసన

రాజేంద్రనగర్‌, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పీజీ, పీహెచ్‌డీ చదువుతున్న విద్యార్థులు తమకు ప్రతి నెలా చెల్లిస్తున్న స్టైపండ్‌ను పెంచాలని డిమాండ్‌ చేశారు. 20 రోజులుగా ప్రభుత్వం చుట్టూ తిరిగినా ఫలితం లేదని చెప్పి, వారు సోమవారం రాజేంద్రనగర్‌ వ్యవసాయ కళాశాల గేటు రోడ్డుపై బైఠాయించారు.


ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ.. సెమిస్టర్‌కు రూ.30వేలు ఫీజు తీసుకుంటున్నారని, సంవత్సరానికి 10శాతం ఫీజు పెంచుతున్నారని గుర్తుచేశారు. కానీ, 2011 నుంచి వర్సిటీలో పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులకు స్టైపండ్‌ను మాత్రం పెంచడం లేదన్నారు. పీజీ విద్యార్థుల స్టైపండ్‌ను రూ.12వేలకు, పీహెచ్‌డీ విద్యార్థుల స్టైపండ్‌ను రూ.15వేలకు పెంచాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Jun 24 , 2025 | 04:45 AM