Share News

NMC Guidelines: వైద్య బోధన సిబ్బందికి ‘ముఖ హాజరు’

ABN , Publish Date - Apr 21 , 2025 | 03:50 AM

వైద్య విద్య కళాశాలల్లో నకిలీ బోధన సిబ్బందికి చెక్‌ పెట్టే దిశగా జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ) నిర్ణయించింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ముఖ హాజరు విధానాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించింది.

NMC Guidelines: వైద్య బోధన సిబ్బందికి ‘ముఖ హాజరు’

మే 1 నుంచి అమలుకు ఎన్‌ఎంసీ సన్నాహాలు.. వైద్య విద్య సంచాలకులు, కళాశాలలకు లేఖలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): వైద్య విద్య కళాశాలల్లో నకిలీ బోధన సిబ్బందికి చెక్‌ పెట్టే దిశగా జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ) నిర్ణయించింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ముఖ హాజరు విధానాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల హెల్త్‌ సెక్రటరీలు, వైద్య విద్య సంచాలకులు, ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలకు లేఖలు పంపింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆధార్‌ ఆధారిత హాజరు విధానాన్ని(అబా్‌సను) రద్దు చేసి.. ముఖ హాజరు విధానానికి శ్రీకారం చుట్టనున్నట్లు అందులో పేర్కొంది. సంబంధిత మార్గదర్శకాలను అందులో ప్రస్తావించింది. ముఖ హాజరులో రెండు విధానాలున్నాయని ఎన్‌ఎంసీ పేర్కొంది.


సిలికాన్‌ థంబ్‌లతో దొంగ హాజరు

ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో అధ్యాపకులు అబాస్‌ను దుర్వినియోగం చేస్తున్నారన్న ఫిర్యాదులున్నాయి. వేలిముద్ర వేస్తే హాజరుపడే అవకాశం ఉండడంతో సిలికాన్‌ థంబ్స్‌ తయారు చేయించి, కాలేజీలోని క్లర్క్‌లకో, కిందిస్థాయి సిబ్బందికో ఇచ్చి అటెండెన్స్‌ వేయించుకునేవారు. అబాస్‌ ఏర్పాటైన తొలిరోజుల్లో కొద్దిమందికే పరిమితమైన ఈ వ్యవహారం క్రమంగా పెద్ద కుంభకోణంగా మారింది. దీనిపై ఎన్‌ఎంసీకి పెద్దఎత్తున ఫిర్యాదులందడంతో కొత్తగా ముఖ హాజరు విధానానికి ఎన్‌ఎంసీ శ్రీకా రం చుట్టింది. కొత్త విధానంలో వైద్య కళాశాలల్లో హాజరు శాతం కచ్చితంగా మెరుగవుతుందని వైద్యవిద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే, దేశవ్యాప్తంగా అన్ని వైద్య కళాశాల్లో పని చేస్తున్న అధ్యాపకుల వివరాలను ఎన్‌ఎంసీ వెబ్‌సైట్‌లో పొందుపరిస్తే.. ఘోస్ట్‌ ఫ్యాకల్టీకి చెక్‌ పడుతుందని చెబుతున్నారు. ఎన్‌ఎంసీ తనిఖీలకు వచ్చినప్పుడు కాలేజీ యాజమాన్యాలు చెప్పే అధ్యాపకుల పేర్లకు, ఎన్‌ఎంసీ వెబ్‌సైట్‌లో ఉన్న పేరుతో పోలిక ఉందో లేదో అప్పుడే తెలుసుకోవచ్చని అంటున్నారు.


Also Read:

క్రికెట్ ఆడుతోండగా పిడుగు పడి.. యువకులు మృతి

థాకరే, రాజ్ మధ్య సయోధ్యపై బీజేపీ ఆసక్తికర వ్యాఖ్యలు

గుజరాత్‌లో పటేల్ విగ్రహాన్ని పరిశీలించిన మంత్రి

For More Telangana News and Telugu News..

Updated Date - Apr 21 , 2025 | 03:50 AM