Hyderabad: నిమ్స్‌లో పిల్లలకు ప్రత్యేక క్యాన్సర్ విభాగం
ABN , Publish Date - Feb 16 , 2025 | 04:50 AM
క్యాన్సర్‌తో బాధపడుతు న్న పిల్లలకు మెరుగైన చికిత్స అందించడానికి నిమ్స్‌లో ప్రత్యేక విభాగం ఏర్పా టు చేయబోతున్నామని ఆ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ బీరప్ప నగరి తెలిపారు.

20 పడకలతో ఏర్పాటు: నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): క్యాన్సర్‌తో బాధపడుతు న్న పిల్లలకు మెరుగైన చికిత్స అందించడానికి నిమ్స్‌లో ప్రత్యేక విభాగం ఏర్పా టు చేయబోతున్నామని ఆ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ బీరప్ప నగరి తెలిపారు. అంతర్జాతీయ బాల్య క్యాన్సర్ దినోత్సవం (ఐసీసీడీ) సందర్భంగా శనివారం నిమ్స్ లో ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఐఏపీ) సింపోజియం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బీరప్ప, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణ ప్రారంభించారు. బీరప్ప మాట్లాడుతూ పిల్లల కోసం 20 పడకలతో ఈ ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామని చెప్పారు.
నిమ్స్ అంకాలజీ విభాగం అధిపతి డాక్టర్ సదాశివుడు గుండేటి మాట్లాడుతూ తమ ఆస్పత్రిలో బోన్‌మారో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ పండ్ ద్వారా కూడా పిల్లలకు క్యాన్సర్ చికిత్సలు అందిస్తున్నామని చెప్పారు. నిమ్స్ ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్ డాక్టర్ శాంత్వీర్ జీ యుప్పిన్, ఐఏపీ జంట నగరాల శాఖ అధ్యక్షుడు డాక్టర్ జీవీఎల్‌ఎన్ చారి, నిలోఫర్ ఆస్పత్రి ప్రొఫెసర్ విజయ్‌కుమార్, ఇండియన్ ఆసోసియేషన్ ఆప్ పీడియాట్రిక్ (ఐఎపీ) ప్రతినిఽధులు, నిలోఫర్, గాంధీ, కాకతీయ వైద్య కళాశాలలు, బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రికి చెందిన విభాగాల అధిపతులు, వైద్యులు పాల్గొన్నారు.