నీట్‌లో ర్యాంకు రాలేదని విద్యార్థిని ఆత్మహత్య
ABN , Publish Date - Jun 16 , 2025 | 05:00 AM
ఇటీవల వెలుబడిన నీట్ ఫలితాల్లో మంచి ర్యాంకు రాలేదనే మనస్తాపంతో ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది.

వెల్దండ, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): ఇటీవల వెలుబడిన నీట్ ఫలితాల్లో మంచి ర్యాంకు రాలేదనే మనస్తాపంతో ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం నారాయణపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని తండాలో జరిగింది. తండాకు చెందిన ఇస్లావత్ పాండు, చిట్టి దంపతుల కుమార్తె శ్రావణి (19) హైదరాబాద్‌లో నీట్ పరీక్ష కోసం శిక్షణ తీసుకుంది.
శనివారం విడుదలైన నీట్ ఫలితాల్లో ఆమెకు 720 మార్కులకు గాను 200 మాత్రమే వచ్చాయి. మంచి ర్యాంకు రాలేదనే మనస్తాపంతో ఆదివారం ఉదయం తల్లిదండ్రులు పొలానికి వెళ్లిన తర్వాత ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరి వేసుకుంది. శ్రావణికి రెండో ప్రయత్నంలోనూ నీట్‌లో మంచి ర్యాంకు రాకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.