Share News

తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ భేష్‌

ABN , Publish Date - Apr 26 , 2025 | 04:52 AM

భారత్‌ సదస్సుకు దాదాపు 100 దేశాల నుంచి పలు పార్టీల ప్రతినిధులతో పాటు పెట్టుబడిదారులు, సామాజికవేత్తలు హాజరయ్యారు.

తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ భేష్‌

ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అంతం చేయాల్సిందే.. సదస్సులో పలువురి అభిప్రాయం

భారత్‌ సదస్సుకు దాదాపు 100 దేశాల నుంచి పలు పార్టీల ప్రతినిధులతో పాటు పెట్టుబడిదారులు, సామాజికవేత్తలు హాజరయ్యారు. లింగ సమానత్వం, సామాజిక న్యాయం తదితర అంశాలపై జరుగుతున్న చర్చలలో పాల్గొనడానికి ఆయా దేశాల నుంచి వచ్చిన కొంతమంది ‘ఆంధ్రజ్యోతి’తో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. - ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌ సిటీ


దక్షిణ భారత్‌లోనే పెట్టుబడులకు అవకాశాలు

18.jpg

ఉత్తర భారతదేశంతో పోలిస్తే దక్షిణ భారతదేశంలోనే పెట్టుబడులకు అవకాశాలెక్కువ. తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ భేష్‌. ఆర్థిక వృద్ధి బాగుంది. ఇక్కడ మంచి నాయకత్వం ఉంది. నేను న్యూయార్క్‌లో ఇన్వె్‌స్టమెంట్‌ కన్సల్టెంట్‌గా చేస్తున్నాను. పలు దేశాలల్లో పెట్టుబడుల అవకాశాలను గురించి సలహాలివ్వడంతో పాటుగా అవకాశాలను కూడా చెబుతుంటాం. ఈ రోజు భారత్‌ సదస్సులో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ కోసమే ఇక్కడికి వచ్చాను. ప్రపంచంలోనే పెట్టుబడులు పెట్టేందుకు భారత్‌ ఇప్పుడు అత్యుత్తమ దేశాలలో ఒకటి. కశ్మీర్‌లో జరిగిన ఉగ్ర ఘటన పిచ్చి చర్య. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అంతం చేయాల్సిందే.

- రాహుల్‌ దీదీ, ఎండీ, సౌత్‌ ఏసియన్‌

ఇన్వె్‌స్టమెంట్‌ ఎడ్వైజరీ గ్రూప్‌, యూఎ్‌సఏ


అమెరికా నుంచి కుర్దిష్‌ గురించి పోరాటం

17.jpg

వాషింగ్టన్‌ నుంచి భారత్‌ సదస్సులో పాల్గొనడానికి ప్రత్యేకంగా వచ్చాను. నిజానికి నేను కెనడియన్‌ను.. కానీ, యుఎ్‌సలో స్థిరపడ్డాను. కోమల పార్టీ ఆఫ్‌ ద ఇరానియన్‌ కుర్దిస్తాన్‌ ప్రతినిధిగా కుర్దిష్‌ ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నాము. ఇరాన్‌లో కుర్దిష్‌ ప్రజల మానవ హక్కులు హరించబడుతున్నాయి. మా కోమల పార్టీ సెక్యులర్‌ పార్టీ.

-సలా బయాజిద్ది, యుఎ్‌సలోని కోమల పార్టీ ఆఫ్‌ ద ఇరానియన్‌ కుర్దిస్తాన్‌ ప్రతినిధి


అన్ని దేశాల్లోనూ లింగ వివక్ష

లింగ సమానత్వం గురించి మాట్లాడటానికి ఇక్కడికి వచ్చాను. అన్ని దేశాలల్లోనూ లింగ వివక్ష కొనసాగుతూనే ఉంది. లింగ సమానత్వం గురించి విస్తృతంగా చర్చ జరగాలి. నేను స్వీడన్‌ విదేశీ వ్యవహారాల మంత్రిగా పనిచేసిన కాలంలో ఫెమినిస్ట్‌ ఫారిన్‌ పాలసీ తీసుకురావాలని ప్రయత్నించాను.

- ఆన్‌ లిండా, స్వీడన్‌ మాజీ మంత్రి

Updated Date - Apr 26 , 2025 | 04:52 AM