Share News

Basavatarakam; బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రికి.. ‘నాట్స్‌’ 85 లక్షల విరాళం

ABN , Publish Date - Jul 08 , 2025 | 04:21 AM

హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రికి ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్‌) రూ.85లక్షల (లక్ష డాలర్ల) విరాళం అందజేసింది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టాంపాలో నాట్స్‌ 8వ తెలుగు సంబరాల ముగింపు..

Basavatarakam; బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రికి.. ‘నాట్స్‌’ 85 లక్షల విరాళం

  • ఆస్పత్రి చైర్మన్‌ బాలకృష్ణకు అందజేత

  • ముగిసిన నాట్స్‌ 8వ తెలుగు సంబరాలు

(టాంపా నుంచి కిలారు గోకుల్‌ కృష్ణ): హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రికి ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్‌) రూ.85లక్షల (లక్ష డాలర్ల) విరాళం అందజేసింది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టాంపాలో నాట్స్‌ 8వ తెలుగు సంబరాల ముగింపు రోజైన ఆదివారం (ఈ నెల 6న) ఈ విరాళాన్ని ఆస్పత్రి చైర్మన్‌, సినీనటుడు నందమూరి బాలకృష్ణకు.. నాట్స్‌ సభల కన్వీనర్‌ గుత్తికొండ శ్రీనివాస్‌, బోర్డు చైర్మన్‌ పిన్నమనేని ప్రశాంత్‌, అధ్యక్షుడు మందాడి శ్రీహరి, మాజీ అధ్యక్షుడు మదన్‌ పాములపాటి చేతులమీదుగా అందజేశారు. నందమూరి బాలకృష్ణ-వసుంధర దంపతులను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించారు.


ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమను తాము తెలుసుకొని ప్రేమించడం నేర్చుకోవాలన్నారు. సినీ సంగీత దర్శకుడు ఎస్‌.ఎ్‌స.థమన్‌ బృందంతో కలిసి బాలకృష్ణ పాటలు పాడి అలరించారు. అనంతరం ‘శక పురుషుడు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సినీ నటుడు వెంకటేశ్‌, నందమూరి రామకృష్ణ, అట్లూరి అశ్విన్‌, ఏపీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Updated Date - Jul 08 , 2025 | 04:21 AM