Vijay Deverakonda: హీరో విజయ్ వ్యాఖ్యలపై ఎస్టీ కమిషన్ విచారణ
ABN , Publish Date - Jul 11 , 2025 | 05:06 AM
సినీ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల ఒక సినిమా వేడుకలో గిరిజనులకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ వచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు..

సైబరాబాద్ పోలీసులపై సీరియస్
కమిషనర్‌ను విచారణకు పిలిస్తే ఏసీపీ వచ్చారెందుకని ప్రశ్న
హైదరాబాద్, జూలై 10 (ఆంధ్రజ్యోతి): సినీ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల ఒక సినిమా వేడుకలో గిరిజనులకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ వచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన జాతీయ ఎస్టీ కమిషన్ గురువారం సైబరాబాద్ పోలీసులపై సీరియస్ అయింది. విచారణకు సైబరాబాద్ కమిషనర్‌ను రావాలని నోటీసు జారీ చేస్తే.. మాదాపూర్ ఏసీపీ విచారణకు రావడాన్ని కమిషన్ తప్పు పట్టింది.
విచారణకు పిలిచింది కమిషనర్‌ను, మీరెందుకు వచ్చారు? ఆ మాత్రం తెలియదా అంటూ విచారణ అధికారి, కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ అసహనం వ్యక్తం చేశారు. మరో 15 రోజుల్లో సైబరాబాద్ కమిషనర్ విచారణకు హాజరుకాని పక్షంలో డీజీపీకి సమన్లు ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించారు.