Share News

Narayana Educational Institutions: నారాయణ-గూగుల్‌ క్లౌడ్‌ భాగస్వామ్యం

ABN , Publish Date - Aug 03 , 2025 | 04:30 AM

విద్యా రంగంలో నూతన సంస్కరణలు తీసుకురావడానికి నారాయణ విద్యాసంస్థలు, గూగుల్‌ క్లౌడ్‌ ఇండియా ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి.

Narayana Educational Institutions: నారాయణ-గూగుల్‌ క్లౌడ్‌ భాగస్వామ్యం

  • కృత్రిమ మేధ సాయంతో బోధన

హైదరాబాద్‌, ఆగసు 2 (ఆంధ్రజ్యోతి): విద్యా రంగంలో నూతన సంస్కరణలు తీసుకురావడానికి నారాయణ విద్యాసంస్థలు, గూగుల్‌ క్లౌడ్‌ ఇండియా ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ భాగస్వామ్యంతో విద్యార్థులకు కృత్రిమ మేధ(ఏఐ) సాయంతో బోధన అందించనున్నారు. ఈ ఒప్పందం ద్వారా నారాయణ గ్రూపు డిజిటల్‌ వ్యవస్థను గూగుల్‌ క్లౌడ్‌తో అనుసంధానం చేస్తారు. దీని వల్ల ప్రతి విద్యార్థి సామర్థ్యం, నేర్చుకునే వేగం ఆధారంగా ప్రత్యేక విద్యా ప్రమాణాలు రూపొందిస్తారు.


ముఖ్యంగా జేఈఈ, నీట్‌ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ప్రత్యేక సలహాలు, సూచనలు లభిస్తాయి. అంతేకాకుండా దేశంలోని వివిధ భాషల విద్యార్థుల కోసం బహుళ భాషా మద్దతు కూడా అందుబాటులో ఉంటుంది. భవిష్యత్తులో నారాయణ విద్యా సంస్థలు అందించే అన్ని ఏఐ టూల్స్‌ గూగుల్‌ క్లౌడ్‌ టెక్నాలజీపై ఆధారపడి ఉంటాయని ఆ సంస్థల ప్రెసిడెంట్‌ పునీత్‌ తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా విద్యార్థుల కలలను సాకారం చేయడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

Updated Date - Aug 03 , 2025 | 04:30 AM