Share News

Hyderabad: ఎన్టీఆర్ తలసేమియా కేర్ సెంటర్‌ను ప్రారంభించిన నారా భువనేశ్వరి..

ABN , Publish Date - Apr 25 , 2025 | 06:02 PM

తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తలసేమియా కేర్ సెంటర్‌ను ప్రారంభించారు. మెనెజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి, సంగీత దర్శకుడు తమన్ ఈ కేర్ సెంటర్‌ను ఓపెన్ చేశారు.

Hyderabad: ఎన్టీఆర్ తలసేమియా కేర్ సెంటర్‌ను ప్రారంభించిన నారా భువనేశ్వరి..
Thalassemia Care Centre

హైదరాబాద్, ఏప్రిల్ 25: తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తలసేమియా కేర్ సెంటర్‌ను ప్రారంభించారు. మెనెజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి, సంగీత దర్శకుడు తమన్ ఈ కేర్ సెంటర్‌ను ఓపెన్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈఓ రాజేంద్ర కుమార్, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన నారా భువనేశ్వరి.. ఫిబ్రవరిలో జరిగిన మ్యూజికల్ నైట్‌లో తలసేమియా సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించామన్నారు. ఆ మాట ప్రకారం.. ఇప్పుడు 25 బెడ్స్‌తో తలసేమియా కేర్ సెంటర్‌ను ప్రారంభించటం ఆనందంగా ఉందన్నారు. తలసేమియా ఓ జెనిటిక్ వ్యాధి అని.. దాని చికిత్స ఎంతో ఖర్చుతో కూడుకున్నదని చెప్పారు. తలసేమియా వ్యాధి గ్రస్తులకు రక్తం అవసరం ఉందన్నారు. రాబోయే వరల్డ్ తలసేమియా డే మే8 న వైజాగ్‌‌లో రన్ నిర్వహించనున్నట్లు నారా భువనేశ్వరి ప్రకటించారు. తలసేమియా బాధితులకు తామున్నామనే నమ్మకాన్ని పెంచేలా వారికి మద్దతుగా ఈ రన్ ఉంటుందని చెప్పారు. ఎన్టీఆర్ స్ఫూర్తిత ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రజల కోసం చేస్తున్నామని భువనేశ్వరి తెలిపారు. మే 8వ తేదీ 3 కె, 5 కే, 10 కె రన్‌లో పాల్గొన్నాల్సిందిగా ప్రజలకు పిలుపునిచ్చారు భువనేశ్వరి.


తమన్ మాట్లాడుతూ.. గతంలో తలసేమియా మ్యూజికల్ నైట్ కార్యక్రమంలో చేస్తానో అనుకున్నాను. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్, బాలకృష్ణ ముందు పెర్ఫామ్ చేయడానికి టెన్షన్ వచ్చింది. కానీ, నారా భువనేశ్వరి సపోర్ట్ వల్ల మా టీమ్ బాగా చేయగలిగాము. సోషల్ సర్వీస్ చేయడంలో ఎంతో కిక్ లభించింది. నా ఈ 40 ఏళ్లలో ఎంతో హై చూశాను. జీవితమంతా నా చివరి శ్వాస వరకు మీ సేవాకార్యక్రమాల్లో పాల్గొంటాను. నారా భువనేశ్వరి గారు రిలాక్స్ అవ్వొచ్చు. కానీ, ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారు. వారిది గొప్ప మనసు. తలసేమియా గురించి నా చుట్టు పక్కల వారిని ఎడ్యుకేట్ చేస్తాను. మే 8వ తేదీన వైజాగ్‌లో తలసేమియా రన్‌లో నేను పాల్గొంటాను. అయితే, పరుగెత్తను కానీ నడుస్తానంటూ తమన్ పేర్కొన్నారు.


ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈవో రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ పేరు మీద చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్‌ను స్థాపించారు. ఈ ట్రస్ట్‌ను భువనేశ్వరి చాలా సమర్థవంతంగా నడిపిస్తున్నారు. ప్రజలకు అండగా తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగానే తలసేమియా కేర్ సెంటర్‌ను ప్రారంభించారు. వైజాగ్ మే 8 న తలసేమియా రన్ కూడా నిర్వహించనున్నారు. మాకు సపోర్ట్ చేసిన తమన్ చేతుల మీదగానే తలసేమియా సెంటర్‌ను ప్రారంభించాలని నారా భువనేశ్వరి నిర్ణయించారని చెప్పారు.


Also Read:

లాక్ చేసిన గదిలో డేంజరస్ గేమ్.. చివరకు ఏమైందో

భారత్ పై కారుకూతలు కూసిన లష్కరే హఫీజ్

సన్‌రైజర్స్‌కు లాస్ట్ చాన్స్

For More Telangana News and Telugu News..

Updated Date - Apr 25 , 2025 | 06:02 PM