Road Accident: సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఇద్దరి మృతి
ABN , Publish Date - Jun 26 , 2025 | 07:12 AM
Road Accident: సూర్యాపేట జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వచ్చిన కారు.. ముందు వెళుతున్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

Suryapet Dist: కోదాడ మండలం (Kodada Manda) దుర్గాపురం వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి (Two Dead) చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు (Two Injured). వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అతి వేగంగా వచ్చిన కారు.. ముందు వెళుతున్న లారీని ఢీ కొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
మృతులు కోనసీమ జిల్లా ఆలమూరు ఎస్ఐ అశోక్, కానిస్టేబుల్ స్వామిగా గుర్తించారు. అతి వేగం, నిద్రలేమి ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని కోదాడ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
భారత అంతరిక్ష చరిత్రలో నూతన మైలురాయి
5 లక్షలు జమ చేసేందుకు సమయం ఇవ్వండి
For More AP News and Telugu News